సోనీ కంపెనీ నుండి కొత్త 4కె హ్యాండిక్యామ్‌ విడుదల...

By Sandra Ashok Kumar  |  First Published Mar 9, 2020, 3:16 PM IST

సోనీ కంపెనీ  ప్రకారం ఈ హ్యాండిక్యామ్ కంటెంట్ క్రియేట్ చేసే వారికోసం, విలాగర్స్ కోసం రూపొందించారు.


ప్రముఖ ఎలక్ట్రొనిక్ డివైజెస్ కంపెనీ  సోనీ ఇండియా మార్చి 6న కొత్త 4కె హ్యాండిక్యామ్ 'ఎఫ్‌డిఆర్-ఎఎక్స్ 43' ను లాంచ్ చేసింది. ఇది సార్వత్రిక ప్రశంసలు పొందిన ఇంటర్నల్ గింబాల్ మెకానిజం, బ్యాలెన్స్డ్ ఆప్టికల్ స్టెడిషాట్ టెక్నాలజీ ద్వారా స్ముత్ వీడియో ఫుటేజ్‌ రికార్డు చేయడానికి సపోర్ట్ చేస్తుంది.

హ్యాండిక్యామ్ అన్ని సోనీ సెంటర్, ఆల్ఫా ఫ్లాగ్‌షిప్ స్టోర్లు, సోనీ గుర్తింపు పొందిన డీలర్లు ఇంకా భారతదేశంలోని ప్రధాన ఎలక్ట్రానిక్ స్టోర్లలో లభిస్తుంది. అయితే ధర మాత్రం కేవలం రూ .83,490కే లభిస్తుంది.సోనీ కంపెనీ  ప్రకారం ఈ హ్యాండిక్యామ్ కంటెంట్ క్రియేట్ చేసే వారికోసం, విలాగర్స్ కోసం రూపొందించారు.

Latest Videos

also read 108 ఎంపి కెమెరాతో షియోమి కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్...

దీనిలో ఏX43 లెన్స్‌ను కలిగి ఉంది. ఇది 26.8 ఎం‌ఎం వైడ్-యాంగిల్ కలిగి ఉంటుంది. ఇది ఫ్రేమ్‌లో సరిపోయేలా చేస్తుంది. ఇది 20x ఆప్టికల్ జూమ్ (26.8-536.0 ఎం‌ఎం; 16: 9 మోడ్), ప్లస్ 30x (4 కె) 7 లేదా 40 ఎక్స్ (హెచ్‌డి) క్లియర్ ఇమేజ్ జూమ్ ఇంకా 250x డిజిటల్ జూమ్‌తో అనేక రకాల ఫోటో లను తీయడానికి వినియోగదారులకు సపోర్ట్ చేస్తుంది.

హ్యాండిక్యామ్ ప్రీమియం ఆడియో కనెక్టివిటీ కోసం ఇంటర్నల్ మల్టీ-క్యాప్సూల్ మైక్రోఫోన్‌తో వస్తుంది.  ప్రో-లాంటి మూవీ ప్రొడక్షన్ కోసం ఎక్స్ టర్నల్ మైక్రోఫోన్ కోసం కనెక్టర్ కూడా అందిస్తుంది. ఈ హ్యాండిక్యామ్ ద్వారా వినియోగదారులు మూవీ ఎడిటింగ్‌ను హైలైట్ మూవీ మేకర్‌తో స్ట్రీమ్ లైన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది.

also read కరోనా వైరస్ పై ఉద్యోగులకు ఆపిల్ సి‌ఈ‌ఓ సలహా...

రికార్డింగ్ చేసేటప్పుడు హైలైట్ పాయింట్లకు కీ మోమెంట్స్ యాడ్ చేయవచ్చు.  తరువాత క్యామ్ రికార్డర్ 4 కె లేదా హెచ్‌డి మూవీని ఆటోమేటిక్ గా జెనరేట్ చేస్తుంది. దీనికి తోడుగా మీరు సెలెక్ట్ చేసుకున్నా సౌండ్‌ట్రాక్‌ కూడా వీడియొకి యాడ్ చెయ్యొచ్చు.  

click me!