ఏడు గంటల బ్యాటరీ లైఫ్ తో సెన్‌హైజర్ కొత్త వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

By Sandra Ashok Kumar  |  First Published Mar 14, 2020, 1:01 PM IST

ఈ ఇయర్‌ఫోన్‌ల ధర $ 300 (సుమారు రూ. 22,200) ఉంటుంది, ఫస్ట్ జెనరేషన్ మొమెంటం ట్రూ వైర్‌లెస్ లాగానే ఇవి కూడా ఉంటాయి.


గత సంవత్సరంలో ప్రారంభించిన సెన్‌హైజర్ మొమెంటం ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు మా ఫేవరెట్ ఇయర్‌ఫోన్‌లు. అయితే క్వాల్కమ్ ఆప్టిఎక్స్ బ్లూటూత్ కోడెక్‌ సపోర్ట్ తో వచ్చిన మొట్టమొదటి ట్రు  వైర్‌లెస్ హెడ్‌సెట్లలో ఇది ఒకటి, మొమెంటం ట్రు వైర్‌లెస్ ఇప్పటికీ దాని విభాగంలో ఉత్తమ సౌండింగ్ హెడ్‌సెట్లలో ఒకటి కావడం విశేషం.

సెన్‌హైజర్ బ్రాండ్ ఇప్పుడు దాని తరువాత మోడల్ ని విడుదల చేసింది. సెన్‌హైజర్ మొమెంటం ట్రు వైర్‌లెస్ 2 పేరుతో దీనిని లాంచ్ చేశారు. దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్, మెరుగైన బ్యాటరీ లైఫ్ స్పెషల్ ఫీచర్ గా నిలుస్తాయి.

Latest Videos

undefined

also read టు ఇన్ వన్ : లాప్‌టాప్ కం టాబ్లెట్...ఎప్పుడైనా చూసారా ?

కొత్త ఇయర్‌ఫోన్‌ల ధర $ 300 (సుమారు రూ. 22,200) ఉంటుంది. ఒరిజినల్ మొమెంటం ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌  ఫస్ట్ మోడల్ లాంచ్ ధరతో సమానం.యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్  ద్వారా డిస్టర్బ్ చేసే ఆడియో పాస్‌త్రూ కాకుండా ఉంటాయి.

అంతే కాదు ఏడు గంటల పాటు లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. దీని చార్జింగ్ కేసు మొత్తం 28 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో మూడుసార్లు అదనంగా ఫుల్ ఛార్జీ చేసుకోవడానికి అందిస్తుంది. సెన్‌హైజర్ మొమెంటం ట్రు వైర్‌లెస్ 2 ఇయర్‌ఫోన్‌లు ఓల్డ్ వెర్షన్ కంటే 2ఎం‌ఎం చిన్నవిగా ఉంటాయి.

స్పెసిఫికేషన్ల పరంగా, దీనిలో క్వాల్‌కామ్ ఆప్టిఎక్స్, ఎఎసి బ్లూటూత్ కోడెక్‌ సపోర్ట్, కనెక్టివిటీలో బ్లూటూత్ 5.1  ఉన్నాయి. సెన్‌హైజర్ మొమెంటం ట్రు వైర్‌లెస్ 2 ఇయర్‌ఫోన్‌లు వాటర్ రెసిస్టంట్ ఐపిఎక్స్ 4-రేటెడ్ పొందింది.

also read లేటెస్ట్ వెరైటీ ఫీచర్లతో వీయు ప్రీమియం 4కె టీవీలు...

ఫీచర్ సెట్ మొమెంటం ట్రు వైర్‌లెస్ 2 హెడ్‌సెట్‌ ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోకు పోటీగా నిలుస్తుంది.  ప్రస్తుతం ఏప్రిల్ నుండి యు.ఎస్, యూరప్ దేశాలలో అందుబాటులో ఉన్నాయి.
 
ఈ ఇయర్‌ఫోన్‌లు బ్లాక్ కలర్ ఆప్షన్లో మాత్రమే లభిస్తాయి, వైట్ కలర్ వేరియంట్ తరువాత లాంచ్ అవుతుందని తెలిపారు. సెన్‌హైజర్ మొమెంటం ట్రూ వైర్‌లెస్ 2 భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా, ధర ఎంత ఉండొచ్చు అనే వాటిపై ఎటువంటి సమాచారం లేదు.
 

click me!