వచ్చేనెలలో మార్కెట్లోకి శామ్‌సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్....

By Sandra Ashok Kumar  |  First Published Jan 3, 2020, 2:30 PM IST

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్‌సంగ్ తదుపరి తరం గెలాక్సీ ఫోన్ ఎస్20 వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఫిబ్రవరి 11వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం.


సియోల్‌: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం  శామ్‌సంగ్‌ తరువాత తరం గెలాక్సీ ప్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి తీసుకురానుంది.  ఫిబ్రవరి 11 న శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ‘ఎస్ 20’  పేరుతో లాంచ్‌ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

also read ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ తో విడుదల కానున్న ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్

Latest Videos

ఎస్ 11 కు బదులుగా దీన్ని విడుదల చేసేందుకు యోచిస్తోంది. ఎస్‌ 10కు సంబంధించిన ఒక ఫోటోను టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ట్వీట్‌ చేసింది. ఎస్ 11 ఈ, ఎస్ 11, ఎస్ 11ప్లస్‌ కు బదులు, గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌కు కొనసాగింపుగా ఎస్ 20, ఎస్ 20 ప్లస్‌, ఎస్ 20 అల్ట్రా సిరీస్‌ను ఆవిష్కరించనున్నదని తెలిపింది.  

శామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్ 20 ఫోన్‌లో కొన్ని మార్కెట్లలో ఎక్సినోస్ 990  ప్రాసెసర్‌, మెజారిటీ మార్కెట్లలో స్నాప్‌డ్రాగన్ 865ను  జోడించింది. బేస్‌ వేరియంట్‌గా గెలాక్సీ ఎస్ 20 6.2-అంగుళాల స్క్రీన్‌ను, ఎస్ 20 + 6.7అంగుళాల స్క్రీన్‌ను, గెలాక్సీ 20 అల్ట్రా 6.9 అంగుళాల  డిస్‌ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. 

also read కేబుల్ టీవీ వినియోగదారులకు గుడ్ న్యూస్...తక్కువ ధరకే ఎక్కువ ఛానెల్‌లు

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 20, ఎస్‌ 20 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో 108 ఎంపీ మెయిన్‌ కెమెరా, 48 మెగాపిక్సెల్, క్వాడ్‌ కెమెరా ఫీచర్‌ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఈ ఫోన్లలో 4000, 4400, 5000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చినట్టు తెలుస్తోంది. 
 

click me!