సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కోసం కొత్త సూపర్ స్టెడి OIS టెక్నాలజీని ఉపయోగించారు. ఇది తక్కువ ధరలో సరిపోయే స్టాండర్డ్ గెలాక్సీ ఎస్ 10 వెర్షన్ లాగా ఉంటుంది.
సామ్‌సంగ్ CES 2020 ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్‌ను విడుదల చేసింది. ఇది తక్కువ ధరలో సరిపోయే స్టాండర్డ్ గెలాక్సీ ఎస్ 10 వెర్షన్ లాగా ఉంటుంది.శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ స్మార్ట్ ఫోన్ లో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరాకు సామ్‌సంగ్ ఇన్ హౌస్ సూపర్ స్టెడి OIS స్టెబిలైజేషన్ టెక్నాలజికి సపోర్ట్ చేస్తుంది.
also read తక్కువ బడ్జెట్ లో దొరికే లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?
undefined
ఈ ఫోన్ గెలాక్సీ నోట్ 10 లైట్ ఉన్న డిజైన్ క్యూలను దీనికి కూడా పెట్టారు. ఫ్లాట్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం గెలాక్సీ ఎస్ 10 లైట్ ధరను ఇంకా వెల్లడించలేదు. కానీ జనవరి 7న ఒక ప్రకటనను వెల్లడించే అవకాశం ఉంది.
గెలాక్సీ ఎస్ 10 లైట్ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది ఒకటి 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్, రెండోది 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్. ఇది ప్రిజం వైట్, ప్రిజం బ్లాక్ ఇంకా ప్రిజం బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్ ఫీచర్స్ వచ్చేసి దీనికి 6.7-అంగుళాల పూర్తి HD + (1080 x 2400 పిక్సెల్స్) 394 పిపి పిక్సెల్, ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.
గెలాక్సీ ఎస్ 10 లైట్ ముందు నుండి గెలాక్సీ నోట్ 10 లైట్‌తో సమానంగా కనిపిస్తుంది. సెంట్రల్లి హోల్-పంచ్, స్లిమ్ బెజెల్ ఉన్నాయి. వెనుక వైపు గెలాక్సీ ఎస్ 10 లైట్ గెలాక్సీ నోట్ 10 లైట్‌తో పోలిస్తే కొంచెం పెద్ద కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. గెలాక్సీ ఎస్ 10 లైట్ 64-బిట్ 7 ఎన్ఎమ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ నుండి పవర్ పొందుతుంది. ఇది గరిష్టంగా 2.8GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది.
also read మార్కెట్లోకి కొత్త ఔట్ డోర్ స్పీకర్...అతి తక్కువ ధరకే...
సామ్‌సంగ్ ఫోన్ 8 జీబీ ర్యామ్ వరకు ప్యాక్ ఉంటుంది. అయితే 6 జీబీ ర్యామ్‌తో లోయర్ ఎండ్ వేరియంట్ కూడా ఉంది.శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 10 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్, ఎఫ్ / 2.0 లెన్స్ ఇంకా సూపర్ స్టెడి ఓఐఎస్ ఉన్నాయి. దీనితో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో ఎఫ్ / 2.2 ఎపర్చరు, 123-డిగ్రీ ఫీల్డ్ వ్యూ కూడా ఉంది. క్లోజప్ ఫోటోలను క్లిక్ చేయడానికి ఎఫ్ / 2.4 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో తియొచ్చు.