జూక్ బ్రాండ్ ఇప్పుడు కొత్త రాకర్ థండర్ స్టోన్ 24 వాట్ అవుట్డోర్ పార్టీ స్పీకర్ లాంచ్ చేసింది. ఈ రెండు స్పీకర్లను వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది.
టెక్నాలజి ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్న ఫ్రెంచ్ కంపెనీ జూక్ భారతదేశంలో ఇన్నోవేటివ్ మ్యూజిక్ వినే వారికోసం కోసం రాకర్ థండర్ స్టోన్ స్పీకర్లనును లాంచ్ చేసింది. జూక్ రాకర్ థండర్ స్టోన్ 24 వాట్ అవుట్డోర్ పార్టీ స్పీకర్, రెండు స్పీకర్లను టిడబ్ల్యుఎస్ ఫంక్షన్ తో వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసుకోడానికి సపోర్ట్ చేస్తుంది.
ఈ స్పోర్ట్ స్పీకర్ డ్యూయల్ హై-పెర్ఫార్మెన్స్ ఇంకా ఇవి ఏ పార్టీకైనా హై పెర్ఫర్మెన్స్ థంపింగ్ బేస్ తో మ్యూజిక్ లవర్స్ ని ఆకాట్టుకుంటుంది. డైనమిక్ హై డెఫినేషన్ సౌండ్ అవుట్ పుట్ కూడా అందిస్తుంది.దీనికి అదనంగా మైక్ కూడా వస్తుంది. మ్యూజిక్ పార్టీలను నిర్వహించడానికి ఇది సరైన ఎంపికగా ఉంటుంది. వినియోగదారులు బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్స్ కి స్పీకర్లను కనెక్ట్ చేయవచ్చు.
also read కొత్త ఏడాదిలో భారి కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగించనున్న ఇండియా
అలాగే మీకు నచ్చిన మ్యూజిక్ ఆస్వాదించడానికి USB లేదా AUX ఇన్‌పుట్‌ను ఉపయోగించుకొని కనెక్ట్ చేసుకోవచ్చు.ఇంటర్నల్ ఎఫ్.ఎం రిసీవర్ ద్వారా నచ్చిన రేడియో స్టేషన్లను ట్యూన్ చేయడానికి వీలు కల్పిస్తుంది. కాంపాక్ట్ బూమ్‌బాక్స్ హ్యాండిల్‌తో ఇది సుమారు 800 గ్రాముల బరువు ఉంటుంది.
ఇది ఓపెన్ ప్రదేశాలలో పార్టీలను ప్రత్యేకంగా చేయడానికి పోర్టబుల్ ఎక్కడికైనా తీసుకెల్లోచ్చు. వాల్యూమ్, మోడ్‌లను మాన్యువల్‌గా కంట్రోల్ చేయడానికి దీనికి ప్రత్యేకంగా కంట్రోల్ ప్యానెల్‌ను ఉంది.ఈ డివైజ్ 4 ఇంటిగ్రేటెడ్ రీఛార్జిబుల్ లిథియం-అయాన్ బ్యాటర్‌తో వస్తుంది. ఇది వినియోగదారులకు ఎక్కువ కాలం మ్యూజిక్ ఆస్వాదించడానికి సహాయపడుతుంది.
also read వచ్చేనెలలో మార్కెట్లోకి శామ్‌సంగ్ గెలాక్సీ కొత్త స్మార్ట్ ఫోన్....
జూక్ రాకర్ థండర్ స్టోన్ స్పీకర్లు వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మెటీరియల్‌తో తక్కువ నిర్వహణతో తయారుచేశారు. జూక్ రాకర్ థండర్ స్టోన్ కొనుగోలు చేసినప్పుడు 1 ప్రీమియం కరోకే మైక్, 1 ఆక్స్ కేబుల్, 1 మైక్రో యుఎస్బి ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ లభిస్తుంది!
జూక్ రాకర్ థండర్ స్టోన్ ప్రారంభించినప్పుడు జూక్‌లోని కంట్రీ హెడ్-ఇండియా మిస్టర్ అచిన్ గుప్తా మాట్లాడుతూ "జూక్ రాకర్ థండర్ స్టోన్ స్టయిల్, పవర్ చాలా కొత్త ఉంటాయి. దీనిని వైర్‌లెస్ అవుట్ డోర్ స్పీకర్‌గా కూడా వాడుకోవచ్చు.జూక్ రాకర్ థండర్ స్టోన్‌తో ఏ పార్టీ అయిన ప్రత్యేక కార్యక్రమంగా చేసుకోవచ్చు"అని అన్నారు. జూక్ రాకర్ థండర్ స్టోన్ ధర రూ. 2,399 / - ప్రస్తుతం అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో లభిస్తుంది.