శామ్సంగ్ నుండి కొత్త 4జి స్మార్ట్ వాచ్...లేటెస్ట్ ఫీచర్స్ తో...

By Sandra Ashok Kumar  |  First Published Dec 24, 2019, 5:56 PM IST

శామ్‌సంగ్ బ్రాండ్ శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 4జి వేరియంట్‌ను ఈ ఏడాది ఆగస్టులో వై-ఫై ఓన్లీ మోడల్‌తో పాటు లాంచ్ చేశారు.శామ్‌సంగ్ ఒపెరా హౌస్, శామ్‌సంగ్ ఇ-షాప్ ఇంకా ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ లలో కూడా లభ్యమవుతున్నాయి.
 


శామ్‌సంగ్ సంస్థ ఇప్పుడు కొత్త శామ్‌సంగ్ గెలాక్సీ యాక్టివ్ 2 4జి వేరియంట్‌  వాచ్ ను ఇండియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీని ధర రూ. 35,990, కొత్త వేరియంట్ వాచ్ ప్రస్తుతమున్న గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 మోడల్‌తో పాటు అక్టోబర్‌లో  లాంచ్ చేశారు. గెలాక్సీ యాక్టివ్ 2 4జి స్మార్ట్ వాచ్  వినియోగదారుల ఫోన్‌ కు  వచ్చే ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ వాయిస్ కాల్స్ ఈ స్మార్ట్ వాచ్ ద్వారా కాల్స్ మాట్లాడానికి వీలుగా రూపొందించారు.

also read  ఎయిర్‌‌‌‌టెల్‌ కొత్త ఆఫర్...కాల్ ఛార్జీలు లేకుండా ఏ నెట్‌‌వర్క్‌కైనా కాల్స్...

Latest Videos

undefined

ఈ స్మార్ట్ వాచ్ సిల్వర్, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్లతో పాటు 44 ఎంఎం స్టీల్ డయల్‌లో ఉంటుంది. శామ్సంగ్ ఇప్పటికే గెలాక్సీ  యాక్టివ్ 2 4జి వేరియంట్‌ స్మార్ట్ వాచ్ ను ఆఫ్‌లైన్ ఛానెళ్ల ద్వారా విక్రయలను ప్రారంభించింది. శామ్‌సంగ్ ఒపెరా హౌస్, శామ్‌సంగ్ ఇ-షాప్ ఇంకా ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌ లలో కూడా లభ్యమవుతున్నాయి.

శామ్సంగ్ గెలాక్సీ యాక్టివ్ 2 4జి వేరియంట్ స్మార్ట్ వాచ్ ఇసిమ్ కనెక్టివిటీతో వస్తుంది. ఇది వినియోగదారుల ఫోన్ ను స్మార్ట్ వాచ్ కు కనెక్ట్  చేసి నేరుగా కాల్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. సోషల్ మీడియా యాప్ లను కూడా ఇందులో వాడుకోవచ్చు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, రోయింగ్, ఎలిప్టికల్ ట్రైనర్, డైనమిక్ వర్కౌట్స్, స్విమ్మింగ్ వంటి వర్క్ ఔట్స్ కోసం ఆటో ట్రాకింగ్‌తో పాటు 39 విభిన్న ఎక్సైజ్ లను ట్రాక్ చేయడానికి సామ్‌సంగ్ సెన్సార్లను ఇందులో అమర్చారు.

also read షియోమి నుంచి కొత్త వైర్‌లెస్ ప్రాడక్ట్...తక్కువ ధరకే..


ఈ స్మార్ట్ వాచ్  ‘రన్నింగ్ కోచ్’ అప్ డేట్ తో వస్తుంది. ఇది ఏడు వేర్వేరు రన్నింగ్ ప్రోగ్రామ్‌లకు అందిస్తుంది. వినియోగదారులు రన్నింగ్ పేస్‌ను రియల్ టైంలో చూసుకోవచ్చు. అదనంగా, గెలాక్సీ యాక్టివ్ 2 4జి స్లీప్ మోడ్ కూడా ఉంది. ఇది మీరు ఎంత సేపు నిద్ర పోతున్నారో ట్రాక్ చేసి తెలియజేస్తుంది. 

"గెలాక్సీ  యాక్టివ్ 2 4జి వాచ్ ప్రారంభించడంతో, శామ్సంగ్ ఇప్పుడు భారతదేశంలో 4జి-ఎనేబుల్డ్ స్మార్ట్ వాచీల సిరీస్ కలిగి ఉంది. ఇది 2 ప్రత్యేకమైన డిజైన్ టెంప్లేట్లు, 3 సైజులు ఇంకా 6 కలర్ ఫినిషింగ్లలలో వస్తుంది.”అని శామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ ఆదిత్య బబ్బర్ ఓ ప్రకటనలో తెలిపారు.

click me!