ఒప్పో నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు...ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో

By Sandra Ashok Kumar  |  First Published Dec 23, 2019, 3:21 PM IST

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎ8, ఒప్పో ఎ91 ఫోన్‌లను చైనాలో లాంచ్ చేసింది. ఒప్పో A91 హై-ఎండ్ ఫోన్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో, ఆతేంటికేషన్  కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. 


చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇప్పుడు తాజాగా మిడ్-రేంజ్ ఎ-సిరీస్ ఫోన్‌లలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను జోడించింది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఎ8, ఒప్పో ఎ91 ఫోన్‌లను చైనాలో లాంచ్ చేసింది. ఒప్పో A91 హై-ఎండ్ ఫోన్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌, 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో, ఆతేంటికేషన్  కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది.

ఒప్పో A91 వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ ఉంది. మరోవైపు ఒప్పో ఎ8 స్మార్ట్ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 12 మెగాపిక్సెల్ మెయిన్ స్నాపర్‌ ఇందులో ఉంది. దీనికి 2 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్ ఇంకా పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.

Latest Videos

also read  ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు ఫోన్ చూస్తాడో తెలుసా...?


ఒప్పో A91

ఒప్పో A91 ఫోన్ సింగిల్ వేరియంట్‌  8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY 1,999 (సుమారు రూ .20,000), గ్రేడియంట్ ఫినిష్‌తో రెడ్, బ్లూ ఇంకా బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది ఇప్పుడు అధికారిక ఒప్పో ఈ షాప్‌లో ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 26 నుండి చైనాలో అమ్మకం మొదలవుతాయి.

 


ఒప్పో A91 ఫీచర్స్
 
ఒప్పో A91 స్మార్ట్ ఫోన్  లో 6.4-అంగుళాల ఫుల్-HD + (1080 x 2400 పిక్సెల్స్) AMOLED డిస్ ప్లే  90.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, వాటర్‌డ్రాప్ నాచ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వస్తుంది. ఇది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కొత్త ఒప్పో ఫోన్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కేవలం 0.32 సెకన్లలో ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది.

ఒప్పో A91 క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ షూటర్, 119-డిగ్రీల ఫీల్డ్, ప్రత్యేక డేడికేటెడ్ మాక్రో కెమెరా, డీప్ సెన్సార్ ఉన్నాయి. ఇది VOOC 3.0 ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో  4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది కేవలం 30 నిమిషాల్లో ఫోన్‌ను 0-60 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని పేర్కొంది.

also read  రౌండప్ 2019: కొత్త సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్స్ పై...నిపుణులు అంచనా ఏంటంటే...?

ఒప్పో A8 ఫీచర్స్
ఒప్పో A8 లో 6.5-అంగుళాల HD + (720 x 1600 పిక్సెల్స్) డిస్ ప్లే 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇంకా 256GB వరకు మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.

ఒప్పో A8 స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఈ ఫోన్ సింగిల్ వెరీఎంట్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ తో వస్తుంది. దీని ధర CNY 1,199 (సుమారు రూ. 12,000)ను కలిగి ఉంది. ఇప్పుడు ఒప్పో స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ స్టోర్ నుండి ముందే ఆర్డర్ చేయవచ్చు. ఇది చైనాలో డిసెంబర్ 26 నుండి అజూర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది, అయితే భారతదేశంతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో దీని లభ్యతపై ఎటువంటి సమాచారం లేదు.

click me!