అతిపెద్ద 7000mAh బ్యాట‌రీతో వ‌స్తున్న శాంసంగ్ కొత్త ఫోన్‌.. ఫీచర్లు లీక్..

By Sandra Ashok Kumar  |  First Published Aug 25, 2020, 1:53 PM IST

కొన్ని నివేదికల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎం51గా రానుంది.  వచ్చే నెలలో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త ఫోన్‌ విడుదలకు సంబంధించి శాంసంగ్‌ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ ఎం51 స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.


సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ వచ్చే నెలలో ఎం-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు అదనంగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎం51గా రానుంది.  

వచ్చే నెలలో దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త ఫోన్‌ విడుదలకు సంబంధించి శాంసంగ్‌ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినప్పటికీ ఎం51 స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. సెప్టెంబర్ 10న భారత్‌లో లాంచ్ అవుతుందని  టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ ట్విటర్లో పేర్కొన్నారు. 

Latest Videos

undefined

   
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం51లో ఊహించిన స్పెసిఫికేషన్లు

  రాబోయే శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51  6.7-అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, అంటే దీనికి హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే ఆండ్రాయిడ్ 10 బేస్డ్ 1యుఐ 2.1తో, క్వాల్కమ్ మిడ్-రేంజ్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

also read 

దీనితో పాటు 6జిబి లేదా 8 జిబి ర్యామ్ తో రెండు ఆప్షన్లు అలాగే 128 జిబి ఇంటర్నల్  స్టోరేజ్ అందిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కెమెరా మిగతా రెండు 5 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్, మరోకటి 5 మెగాపిక్సెల్ మాక్రో  లెన్స్ ఉనాయి.

సెల్ఫీలు ఇంకా వీడియో కాలింగ్ కోసం శామ్సంగ్ గెలాక్సీ ఎం51 ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను ప్యాక్ చేస్తుంది. హైలైట్ ఏంటంటే  25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో  భారీ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ ఎం సిరీస్ కింద కొన్ని మోడళ్లలో 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందిస్తుంది.

వినియోగదారులు కూడా ఈ కొత్త ఫోన్‌ ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని ఇస్తుందని ఆశిస్తారు, అది కూడా ఒకే ఫుల్ ఛార్జీతో. ధరపై ఇంకా సమాచారం లేనప్పటికీ, ఆకట్టుకునే ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి దీని ధర రూ.25వేల రేంజ్ కంటే తక్కువ ధర ఉంటుందని భావింవచ్చు. 

click me!