ఫిబ్రవరిలో లాంచ్ అయిన గెలాక్సీ ఎం31కి అప్‌గ్రేడ్ అయిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ హోల్-పంచ్ డిస్ ప్లే తో వస్తుంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, గెలాక్సీ ఎం31ఎస్ మెరుగైన కెమెరా అనుభవాన్ని అందించడానికి ఇందులో ఫ్రే-ఇన్‌స్టాల్ చేసిన ఇంటెల్లి-కామ్ ఫీచర్ ఉంది.
సౌత్‌కొరియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్‌లో సరికొత్త మోడల్‌గా శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ను భారతదేశంలో విడుదల చేసింది. ఫిబ్రవరిలో లాంచ్ అయిన గెలాక్సీ ఎం31కి అప్‌గ్రేడ్ అయిన ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ హోల్-పంచ్ డిస్ ప్లే తో వస్తుంది.
క్వాడ్ రియర్ కెమెరా సెటప్, గెలాక్సీ ఎం31ఎస్ మెరుగైన కెమెరా అనుభవాన్ని అందించడానికి ఇందులో ఫ్రే-ఇన్‌స్టాల్ చేసిన ఇంటెల్లి-కామ్ ఫీచర్ ఉంది. శామ్సంగ్ రెండు విభిన్నమైన ర్యామ్ ఆప్షన్స్ అందిస్తుంది. గెలాక్సీ ఎం31ఎస్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
25W ఛార్జర్‌తో పాటు యుఎస్‌బి టైప్-సి నుండి యుఎస్‌బి టైప్-సి కేబుల్‌తో వస్తుంది. ఇంకా ఫోన్ రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్, రియల్ మీ 6ప్రో వంటి స్మార్ట్ ఫోన్ లకు పోటీగా నిలుస్తుంది.
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ధర, లాంచ్ ఆఫర్లు
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31ఎస్ బేస్ వేరియంట్ 6 జిబి ర్యామ్ రూ.19,499 ఉండగా, 8 జిబి ర్యామ్ ఆప్షన్ ధర రూ. 21.499. మిరాజ్ బ్లాక్, మిరాజ్ బ్లూ రంగు ఆప్షన్స్ లో వస్తుంది. అంతేకాకుండా ఆగస్టు 6 నుండి శామ్సంగ్ స్టోర్స్, అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ డే సెల్ కూడా ఆగస్టు 6 నుండి ప్రారంభమవుతుంది.
also read
శామ్సంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో) శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ఆండ్రాయిడ్ 10 యుఐతో పనిచేస్తుంది. 6.5-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్ ప్లే తో పాటు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఉంది.
8 జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ ఎక్సినోస్ 9611, ఫోటోలు ఇంకా వీడియోల కోసం గెలాక్సీ ఎం31ఎస్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX682 సెన్సార్ f / 1.8 లెన్స్, 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 123-డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంది . కెమెరా సెటప్‌లో 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉన్నాయి.
సెల్ఫీలను, వీడియో కాల్‌లను ప్రారంభించడానికి శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ ఉంది. కెమెరా సెన్సార్ 4కె వీడియో రికార్డింగ్, స్లో-మోషన్ వీడియోలు, ఎఆర్ డూడుల్, ఎఆర్ ఎమోజి వంటి ఫీచర్స్ కి సపోర్ట్ చేస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డి కార్డ్ ఆప్షన్, కనెక్టివిటీ ఆప్షన్స్ 4జి విఓఎల్‌టిఈ, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-సి, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 25W ఛార్జర్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.