సామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ ఒక్కసారి ఛార్జీ చేస్తే 11 గంటలు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఛార్జింగ్ కేసు మరో 11 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ చివరకు అధికారికంగా లాంచ్ అయింది. ఊహించినట్లుగా సామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ వనిల్లా గెలాక్సీ బడ్స్ టిడబల్యూఎస్ ఇయర్‌బడ్స్ కంటే కొన్ని పెద్ద అప్ డేట్స్ తో వస్తుంది. అయితే గతంలో ఈ ఇయర్‌బడ్స్ పై కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.
గెలాక్సీ బడ్స్ ప్లస్ లాంగ్ బ్యాటరీ లైఫ్, టు-వే డైనమిక్ స్పీకర్లు మంచి ఆడియో అవుట్ పుట్ ఇస్తుంది. ట్రిపుల్ మైక్రోఫోన్, ఇంకా మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. గొప్ప విషయం ఏంటంటే అవి ఇప్పుడు ఐఫోన్‌లకు కూడా సపోర్ట్ చేస్తాయి.
also read ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో విపణిలోకి 'సామ్‌సంగ్' 5జీ స్మార్ట్ఫోన్లు
గెలాక్సీ బడ్స్ ప్లస్ ధర 149.99 డాలర్లు (సుమారు రూ. 10,700) నలుపు, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. గెలాక్సీ బడ్స్ ప్లస్ ఎకెజి-ట్యూన్డ్ టు-వే స్పీకర్ సిస్టమ్ ఇందులో అమర్చబడి ఉంది. ఇందులో బేస్ అందించడానికి వూఫర్ కూడా ఉన్నాయి.
యాంబియంట్ సౌండ్ టెక్నాలజీకి కూడా సపోర్ట్ ఉంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), సామ్‌సంగ్ కొత్త ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ మంచి సౌండ్ ఐసోలేషన్‌ను అందిస్తుంది. ఇందులో మూడు మైక్‌లు వస్తాయి ఒకటి లోపలి భాగంలో, రెండు బయటికి ఉంటాయి.
ఇంకా ఇందులో ప్రత్యేకంగా చెప్పాలంటే బ్యాటరీ లైఫ్. గెలాక్సీ బడ్స్ ప్లస్ ఒక ఛార్జీపై 11 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు.ఇంకా ఇందులో పెద్ద 85 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ కేసు అదనపు 11 గంటల బ్యాటరీ లైఫ్ అందించగలదు.
also read మార్చిలో మొబైల్ ఫోన్లకు రానున్న కష్టాలు...ఇదీ కరోనా వైరస్ ప్రభావమేన?
గెలాక్సీ బడ్స్ ప్లస్ గంట పాటు పనిచేయాలంటే కేవలం 3 నిమిషాల ఛార్జింగ్ సరిపోతుందని సామ్‌సంగ్ తెలిపింది. సామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ చాలా సులభంగా కనెక్ట్ అవుతుంది అలాగే ట్యాప్-అండ్-హోల్డ్ ఫీచర్స్ కూడా అందిస్తోంది.
బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, గెలాక్సీ బడ్స్ ప్లస్ స్వేట్-ప్రూఫ్ ఐపిఎక్స్ 2 రేటింగ్ కూడా పొందింది. అవి ఆండ్రయిడ్ (1.5GB ర్యామ్, ఆండ్రయిడ్ 5), ఐఓఎస్ (ఐ ఫోన్ 7 లేదా ఐఓఎస్ 10 తో తరువాత మోడల్) డివైజ్ సపోర్ట్ చేస్తాయి. సామ్‌సంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్ గెలాక్సీ బడ్స్ ఒకేలాగా కనిపిస్తాయి. క్యూఐ వైర్‌లెస్ స్టాండర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.