ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో విపణిలోకి 'సామ్‌సంగ్'​ 5జీ స్మార్ట్​ఫోన్లు

By Sandra Ashok Kumar  |  First Published Feb 12, 2020, 4:13 PM IST

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్​ 20 స్మార్ట్​ఫోన్​ సిరీస్​ను ఆవిష్కరించింది. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేథస్సు) కెమెరాలను పొందుపరిచినట్లు పేర్కొంది. సామ్‌సంగ్  ఇదే కార్యక్రమంలో 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ అనే మడత (ఫోల్డింగ్​) ఫోన్​ను కూడా ఆవిష్కరించింది.
 


న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ ​ విపణిలోకి 5జీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా టెక్నాలజీతో సామ్‌సంగ్ కొత్తశ్రేణి ఫోన్​ తన 'గెలాక్సీ ఎస్​ 20 సిరీస్​'ని ఆవిష్కరించింది.

హై-ఎండ్ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సామ్‌సంగ్ దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్​, చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్​ప్లస్​ నుంచి సామ్‌సంగ్ గట్టిపోటీని ఎదుర్కొంటోంది.

Latest Videos

also read ఇండియాలో సామ్‌సంగ్ నుండి గెలాక్సీ ఎం31 స్మార్ట్ ఫోన్ లాంచ్

"ఈ కొత్త దశాబ్దంలో కమ్యూనికేషన్​ వ్యవస్థను '5జీ' పూర్తిగా మార్చివేయనుంది. అందుకే గెలాక్సీ ఎస్​20 వేరియంట్లు-గెలాక్సీ ఎస్​ 20, గెలాక్సీ ఎస్ 20+, గెలాక్సీ ఎస్​ 20 ఆల్ట్రాలను 5జీ కనెక్టివిటీతో తీసుకొస్తున్నాం’ అని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్​, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ హెడ్ టీఎం​ రోహ్ చెప్పారు. 

సామ్‌సంగ్  'అన్​ప్యాక్డ్​ 2020' కార్యక్రమంలో గెలాక్సీ ఎస్​ 20 సిరీస్​ను ఆవిష్కరించింది. ఇందులో హార్డ్​వేర్ ఆధారిత దాడుల నుంచి రక్షించే సరికొత్త, సురక్షితమైన ప్రాసెసర్ వాడినట్లు పేర్కొంది.

గెలాక్సీ ఎస్​ 20 సిరీస్ ఫోన్లలోని కెమెరాల రిజల్యూషన్​ గణనీయంగా పెంచామని సామ్‌సంగ్ తెలిపింది. ఎస్​ 20, ఎస్​ 20 ప్లస్​ల్లో 64 ఎంపీ కెమెరా, ఎస్ 20 ఆల్ట్రాలో 108 ఎంపీ కెమెరా పొందుపరిచినట్లు స్పష్టం చేసింది.

also read  రెడ్‌మి నుండి 8ఎ డ్యూయల్ కొత్త స్మార్ట్ ఫోన్...తక్కువ ధరకే..

గెలాక్సీ ఎస్​ 20 సిరీస్ ఫోన్లు మార్చి 6 నుంచి అందుబాటులోకి రానున్నాయని సామ్‌సంగ్ తెలిపింది. వీటి ప్రాథమిక ధర సుమారు రూ.72,000 (999 డాలర్లు), సుమారు రూ. లక్ష (1,399 డాలర్లు) గా ఉంటుందని స్పష్టం చేసింది.

సామ్‌సంగ్ ఇదే కార్యక్రమంలో 'గెలాక్సీ జెడ్​ ఫ్లిప్'​ అనే మడత (ఫోల్డింగ్​) ఫోన్​ను ఆవిష్కరించింది. ఇది సామ్‌సంగ్  తొలి మడత ఫోను 'గెలాక్సీ ఫోల్డ్​' కంటే భిన్నంగా ఉంది. ఈ కొత్త మడత ఫోన్​ స్క్రీన్​ను 2,00,000 సార్లు మడతపెట్టి, విప్పుకోవచ్చని కంపెనీ తెలిపింది. దీనిని ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీని ధర సుమారు రూ.99 వేలు (1,380 డాలర్లు) ఉంటుందని పేర్కొంది.
 

click me!