షియోమీ వారి రెడ్ మీ నోట్ 9 ఫోన్ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ చేతుల మీదుగా విపణిలో అడుగు పెట్టనున్న ఈ ఫోన్ ధర రూ.20 వేల లోపు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మీ నుంచి విపణిలోకి ప్రవేశిస్తున్న నోట్ సిరీస్ ఫోన్లు అందరికీ సుపరిచితమే. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది.
రెడ్‌మీ నోట్ 4జీతో మొదలైన ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నోట్ 8, నోట్ 8 ప్రో మోడల్ ఫోన్లు వచ్చాయి. తాజాగా ఈ సిరీస్ నుంచి నోట్ 9 త్వరలో రాబోతోంది. ఈ నెల 12వ తేదీన జరిగే కార్యక్రమంలో నోట్ 9 సిరీస్ ఫోన్లను షియోమీ విడుదల చేయనున్నది. బాలీవుడ్ నటుడు రణవీర్‌సింగ్ ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఫోన్‌ను టీజ్ చేస్తూ ఓ పోస్టర్ పెట్టారు.
undefined
also read విమానాల్లో ఇక ఇన్‌ఫ్లైట్ వై-ఫై.. తొలి చాన్స్ విస్తారాకే!
ఈ ఫోన్‌లో వెనుక వైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. ఇది వరకు వచ్చిన నోట్ 8 సిరీస్‌లో క్వాడ్ కెమెరా అమర్చినా నోట్9 సిరీస్‌లో దీర్ఘచతుర్రాసాకారంలో కెమెరా సెటప్ తీసుకొస్తున్నారు. ఇది ఐఫోన్ 11 ప్రోను పోలి ఉంటుంది. రెడ్ మీ నోట్ 9 మోడల్ ఫోన్ ధర రూ.20 వేల లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గతంలో మాదిరిగానే నోట్ 9తోపాటు నోట్ 9 ప్రో ఫోన్ కూడా ఈసారి విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 720జీ ప్రాసెసర్‌తో తెచ్చే అవకాశం ఉంది. దేశీయంగా చైనా కంపెనీలైన రియల్‌మీ, ఐక్యూ బ్రాండ్లు ఇప్పటికే 5జీ ఫోన్లు విడుదల చేశాయి. రియల్‌మీ సైతం 6 సిరీస్‌లో ఫోన్లు ఆవిష్కరించడానికి సిద్ధమైంది.
also read ఉచితమైనా.. కాల్స్ క్వాలిటీపై నో కాంప్రమైజ్: ట్రాయ్
దీంతో తామూ రేసులో ఉన్నామంటూ నోట్9 సిరీస్ ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు షియోమీ ప్రకటన చేయడం గమనార్హం. కానీ రెడ్ మీ నోట్ 9 ఫోన్ విడుదల, అందులోని ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం. ఈ ఫోన్ 6జీబీ, 12 జీబీ వేరియంట్లలో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచ్ హోల్ డిజైన్ గల ఈ ఫోన్ 5000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.