భారత స్మార్ట్‌ఫోన్ విపణిలోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. వివో సబ్ బ్రాండ్ 'ఐక్యూ'.. ఐక్యూ3 పేరుతో ఈ మోడల్ ఫోన్ ఆవిష్కరించింది. దేశంలో ఈ సంస్థ విడుదల చేసిన తొలి స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే.
భారత స్మార్ట్‌ఫోన్ విపణిలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించింది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో సబ్ బ్రాండ్గా ఐక్యూ పేరుతో దేశీయ విపణిలోకి ఆవిష్కరించింది.
'ఐక్యూ3' పేరుతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి మంగళవారం ఐక్యూ విడుదల చేసింది. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 స్టోరేజీ సామర్థ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఐక్యూ అందుబాటులోకి తెచ్చింది.
వీటిలో 8 జీబీ విత్ 128 స్టోరేజీ ర్యామ్ ఫోన్ ధర రూ.36,990, 8 జీబీ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.39,990, 12 జీబీ విత్ 256 జీబీ రామ్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.44,990గా నిర్ణయించింది.
ఐక్యూ 3 స్మార్ట్ ఫోన్ అమ్మకాలు వచ్చే మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐక్యూ డాట్ కాం, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ ద్వారా లావాదేవీలు, అన్ని రకాల ఈఎంఐలపై రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.
ఈ ఫోన్ 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది.
వెనుక వైపు నాలుగు కెమెరాలు (48ఎంపీ+13ఎంపీ+13ఎంపీ+2ఎంపీ),
రియర్ కెమెరాతో 20x జూమ్ సదుపాయం, 16 మెగా పిక్సెళ్ల పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ఇంకా స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 4440 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 55 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ (15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ నింపే సామర్థ్యం) సపోర్ట్ ఉంది. యూఎస్బీ టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్‌తోపాటు ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది.