కొత్త మోడల్ రెడ్‌మి నోట్ 9 సిరీస్‌లో మూడవది. రెడ్‌మి నోట్ 9 ప్రో, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ తర్వాత దీనిని లాంచ్ చేసింది. రెడ్‌మి నోట్ 9 క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. హోల్-పంచ్ డిస్ ప్లే డిజైన్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
షియోమి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 9ను భారత్‌లో విడుదల చేసింది. కొత్త మోడల్ రెడ్‌మి నోట్ 9 సిరీస్‌లో మూడవది. రెడ్‌మి నోట్ 9 ప్రో, రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ తర్వాత దీనిని లాంచ్ చేసింది. రెడ్‌మి నోట్ 9 క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. హోల్-పంచ్ డిస్ ప్లే డిజైన్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
రెడ్‌మి నోట్ 8 అప్ డేట్ గా 25 శాతం పెద్ద బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది ఒకే ఛార్జీపై రెండు రోజుల వినియోగాన్ని ఇస్తుంది. రెడ్‌మి నోట్ 9 కూడా 6 జీబీ ర్యామ్ వరకు అందిస్తుంది. అంతేకాకుండా, ఈ ఫోన్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎ21 ఎస్, ఒప్పో ఎ9 2020, వివో ఎస్1 ప్రోలను మించేలా రూపొందించింది.
ఇండియాలో రెడ్‌మి నోట్ 9 ధర, లభ్యత వివరాలు
భారతదేశంలో రెడ్‌మి నోట్ 9 ధర 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 11,999 రూపాయలు. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.13,499. కాగా టాప్-ఆఫ్-ది-లైన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 14.999. ఇది ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్, పెబుల్ గ్రే మూడు విభిన్న కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. రెడ్‌మి నోట్ 9 జూలై 24 శుక్రవారం నుండి అమెజాన్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు నుండి సేల్స్ కానుంది.
ఏప్రిల్ చివరిలో జరిగిన గ్లోబల్ ఈవెంట్‌లో రెడ్‌మి నోట్ 9 ఆవిష్కరించారు. ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లలో 3 జిబి ర్యామ్ + 64 జిబి, 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది.
also read అతిపెద్ద బ్యాటరీ, లేటెస్ట్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ...
రెడ్‌మి నోట్ 9 ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో)తో రెడ్‌మి నోట్ 9 ఆండ్రాయిడ్ 10 ఓఎస్ తో పనిచేస్తుంది. 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,340 పిక్సెల్‌లు) డాట్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి85 ప్రాసెసర్, వీటితో పాటు 6జిబి వరకు LPDDR4x RAM ఉంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ శామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ జిఎమ్ 1 ప్రైమరీ సెన్సార్‌తో పాటు ఎఫ్/ 1.79 లెన్స్, కెమెరా సెటప్‌లో ఎఫ్/2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఎఫ్ / 2.4 మాక్రో లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెన్సార్, ఎఫ్ / 2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం మీరు ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా, కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11 a / b / g / n, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-సి పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. రెడ్‌మి నోట్ 9 లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ ఇంకా, స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్‌లో 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది (బాక్స్‌లో అనుకూల ఛార్జర్ ఉంటుంది). బ్యాటరీ 9W రివర్స్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది.