అతిపెద్ద బ్యాటరీ, లేటెస్ట్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్

By Sandra Ashok Kumar  |  First Published Jul 20, 2020, 12:03 PM IST

లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆంక్షల సడలింపుతో ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎం 41 స్మార్ట్ ఫోన్ చైనా 3సి సర్టిఫికేషన్ సైట్లో మోడల్ నంబర్ EB-BM415ABY తో కనిపించింది. స్క్రీన్ షాట్ ప్రకారం, శాంసంగ్  గెలాక్సీ ఎం41 భారీ 6,800mAh బ్యాటరీటి‌ మరియు రానున్నట్లు తెలుస్తుంది. 


ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ శామ్సంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తేనుంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆంక్షల సడలింపుతో ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎం 41 స్మార్ట్ ఫోన్ చైనా 3సి సర్టిఫికేషన్ సైట్లో మోడల్ నంబర్ EB-BM415ABY తో కనిపించింది.

స్క్రీన్ షాట్ ప్రకారం, శాంసంగ్  గెలాక్సీ ఎం41 భారీ 6,800mAh బ్యాటరీటి‌ మరియు రానున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ దక్షిణ కొరియా ధృవీకరణ సంస్థ సేఫ్టీ కొరియా సైట్‌లో కూడా దర్శనమిచ్చింది. గత సంవత్సరం, ఒక ప్రముఖ టిప్‌స్టర్ శామ్‌సంగ్ ఫోన్‌ను అభివృద్ధి చేయాలని సూచించింది.

Latest Videos

దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా, 6 జిబి ర్యామ్‌తో వస్తుంన్నట్లు సూచించింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం స్మార్ట్‌ఫోన్ గురించి ఇంకా ధృవీకరించలేదు.

also read 


 శామ్‌సంగ్ గెలాక్సీ ఎం41 అభివృద్ధిని మై స్మార్ట్ ప్రైస్ షేర్ చేసింది. 3సి లిస్టింగ్ స్క్రీన్ షాట్ ప్రకారం, శామ్సంగ్ ఫోన్ మోడల్ నంబర్ EB-BM415ABY, 6,800mAh బ్యాటరీతో వస్తుంది. సేఫ్టీ కొరియా సైట్‌లో అదే మోడల్ నంబర్ కూడా ఉంది, ఇది ఫోన్ బ్యాటరీ ఫోటోను కూడా చూపించింది.

అయితే, సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 41 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో వస్తున్నట్లు  సూచించారు. ఈ ఫోన్ ఎక్సినోస్ 9630 SoC, 6జి‌బి ర్యామ్ తో రాబోతుందని సూచిస్తుంది.

గత సంవత్సరం లాంచ్ చేసిన గెలాక్సీ ఎం40 అప్ డేట్ గా దీనిని తీసుకురానున్నారు. గెలాక్సీ ఎం40 ట్రిపుల్ రియర్ కెమెరాలు, 6 జిబి ర్యామ్‌, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 పనిచేస్తుంది. దీని ధర రూ. భారతదేశంలో 15,999 రూపాయలు.

click me!