ఒప్పో కొత్త చార్జర్.. కేవలం 20 నిమిషాల్లోనే 100% ఫుల్ ఛార్జింగ్‌..

By Sandra Ashok Kumar  |  First Published Jul 15, 2020, 5:51 PM IST

కొత్త టెక్నాలజీని సంస్థ ప్రస్తుతమున్న సూపర్‌వూక్, వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్‌లకు అనుకూలంగా ఉంటుంది. 65W పిడి, 125W పిపిఎస్ స్టాండర్డ్ లకు సపోర్ట్ చేస్తుంది. 


చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో  కొత్తగా 125W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని ఆవిష్కరించింది, ఇది 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కేవలం ఐదు నిమిషాల్లో 41 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది, అంటే కేవలం 20 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. కొత్త టెక్నాలజీని సంస్థ ప్రస్తుతమున్న సూపర్‌వూక్, వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్‌లకు అనుకూలంగా ఉంటుంది.

65W పిడి, 125W పిపిఎస్ స్టాండర్డ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఫ్లాగ్‌షిప్ అప్‌డేట్‌తో పాటు ఒప్పో తన 40W ఎయిర్‌వూక్  సక్సెసర్ మోడల్ 65W ఎయిర్‌వూక్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అధిక-సామర్ధ్యం గల శక్తిని అందించడానికి సంస్థ తన 50W మినీ ఎయిర్‌వూక్, 110W మినీ ఫ్లాష్ ఛార్జర్లను విడుదల చేసింది.

Latest Videos

స్మార్ట్ ఫోన్ తయారీదారి ఫాస్ట్ ఛార్జింగ్‌ను ప్రారంభించడానికి అనుకూలమైన చిప్‌లను అభివృద్ధి చేసింది. ఈ చిప్స్‌లో విసియు ఇంటెలిజెంట్ కంట్రోల్ చిప్, ఎసి / డిసి కంట్రోల్ చిప్, ఎంసియు ఛార్జ్ మేనేజ్‌మెంట్, చిప్‌సెట్, బిఎంఎస్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ చిప్, కస్టమ్ ప్రోటోకాల్ చిప్‌సెట్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో క్విక్ ఛార్జింగ్‌ను అందించడానికి ఇవన్నీ అందించాల్సిన అవసరం ఉంది.

also read 

అదనంగా, ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవానికి ఛార్జర్ యూ‌ఎస్‌బి టైప్-సి ఇంటర్‌ఫేస్‌లో 20V / 6.25A కి సపోర్ట్ ఇస్తుంది. ఇది ప్రస్తుతమున్న 65W సూపర్‌వూక్ 2.0 ఛార్జర్‌తో పోలిస్తే 64x61.5x30 ఎం‌ఎం సైజ్, 153.8 గ్రాముల బరువుతో కొంచెం పెద్దదిగా ఉంటుందని పేర్కొంది.

ప్రత్యేకంగా కొత్త ఛార్జర్ యూ‌ఎస్‌బి టైప్-సి ఇంటర్ఫేస్ పి‌డి, పి‌పి‌ఎస్ ప్రోటోకాల్‌లకు అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త ఛార్జర్‌ను భవిష్యత్తులో 125W ఫ్లాష్ ఛార్జ్-సపోర్టింగ్ హ్యాండ్‌సెట్‌తోనే కాకుండా ఏదైనా సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు లేదా ల్యాప్‌టాప్‌లతో కూడా ఉపయోగించవచ్చని దీని అర్థం.

వేగవంతమైన ఇంకా సురక్షితమైన ఛార్జింగ్‌ను అందించడానికి కస్టమైజ్డ్ ఇంటెలిజెంట్ చిప్, 10 కొత్త ఉష్ణోగ్రత సెన్సార్లు, 128-బిట్ ఎన్‌క్రిప్షన్ అల్గోరిథంను కూడా కంపెనీ రూపొందించింది.  

click me!