సెల్‌ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ వేరియెంట్‌లో భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఏప్రిల్ 10న ఈ మొబైళ్లను ప్రవేశపెడుతున్నట్లు జియోమీ మంగళవారం ప్రకటించింది.
సెల్‌ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ వేరియెంట్‌లో భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఏప్రిల్ 10న ఈ మొబైళ్లను ప్రవేశపెడుతున్నట్లు జియోమీ మంగళవారం ప్రకటించింది.
రెడ్‌మీ నోట్ 7 ప్రో (6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ) ఏప్రిల్ 10న మధ్యాహ్నం 12గంటల నుంచి ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం స్టోర్స్‌లలో అందుబాటులో ఉంటుంది. గత ఫిబ్రవరిలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 7 ప్రో (4జీబీ, 64జీబీ) మోడల్ ఇక మనదేశంలో అందుబాటులో ఉండే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.
రెడ్‌మీ నోట్ 7 ప్రో(6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఆప్షన్) ఏప్రిల్ 10న విడుదల చేస్తామని ప్రకటించిన రెడ్‌మీ ఇండియా, జియోమీ.. ఎన్ని యూనిట్లు విడుదల చేస్తామనేది మాత్రం చెప్పలేదు. ప్రత్యేకమైన ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన కొద్ది క్షణాల్లోనే మొత్తం అమ్ముడయ్యే అవకాశం ఉంది.
ఇండియాలో రెడ్‌మీ నోట్ 7 ప్రో ధర
ఇండియాలో రెడ్‌మీ నోట్ 7 ప్రో(4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ) ప్రారంభ ధర రూ.13,999గా ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ గల వేరియెంట్ ధర రూ. 16,999గా ఉంది. ఈ రెండు మొబైళ్లు కూడా నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్, స్పేస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి.
రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్
డ్యూయెల్ సిమ్(నానో), ఆండ్రాయిడ్ 9పై(ఎంఐయూఐ 10), 6.3ఇంచ్ ఫుల్ హెచ్‌డీ(1080x2340పిక్సెల్స్)తోపాటు 19.5:9కారక నిష్పత్తి. ఈ ఫోన్ 11ఎన్ఎం ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675Soc, 4జీబీ, 6జీబీ ర్యామ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇక కెమెరా విషయానికొస్తే రెడ్‌మీ నోట్ 7 ప్రో డ్యూయెల్ కెమెరా. f/1.79 లెన్స్‌తో ప్రైమరీ సెన్సార్ 48 మెగా పిక్సెల్స్, 5 మెగా పిక్సెల్స్‌తో సెకండరీ డెప్త్ సెన్సార్. ఈ ఫోన్‌కు ముందు భాగంలో 13మెగా పిక్సెల్‌తో సెల్ఫీ, వీడియో, చాట్ సపోర్ట్ కెమెరా కూడా ఉంది.
రెడ్‌మీ నోట్ 7 ప్రో 64జీబీ, 128జీబీ స్టోరేజీలను మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 256జీబీకి పెంచుకోవచ్చు. ఇక కనెక్టివిటీ ఆప్షన్స్ విషయానికొస్తే.. 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.0, GPS/ A-GPS, USB Type-C port, 3.5mm headphone jack కలిగి ఉంది. అంతేగాక, క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0ను తోడ్పడే 4,000mAh బ్యాటరీ ఉంది.