నేటి నుంచే హానర్ గాలా సెలబ్రేషన్స్: స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

By rajesh y  |  First Published Apr 8, 2019, 7:41 PM IST

 ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్.. ‘హానర్ గాలా ఫెస్టివల్’  పేరుతో సోమవారం నుంచి భారీ డిస్కౌంట్లతో సెలబ్రేషన్స్ ప్రారంభించింది. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు ఈ తగ్గింపు ధరలు కొనసాగనున్నాయి. 


ముంబై: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్.. ‘హానర్ గాలా ఫెస్టివల్’  పేరుతో సోమవారం నుంచి భారీ డిస్కౌంట్లతో సెలబ్రేషన్స్ ప్రారంభించింది. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు ఈ తగ్గింపు ధరలు కొనసాగనున్నాయి. 

ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా హానర్ గాలా ఫెస్టివల్ సేల్ పేరుతో సుమారు 50శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. హానర్ 9 ఎన్, హానర్ 9 లైట్, హానర్ 7ఏ, హానర్ 10 లైట్ తదితర ఫోన్లతోపాటు టాబ్లెట్లు, తదితర ఉత్పత్తులపై ఈ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

Celebrating 5 years of ‘Best Quality, True Price’ with . Sale Live on now - https://t.co/HbXIF9DLhw. Hurry! pic.twitter.com/EtHEbp5A7z

— Honor India (@HiHonorIndia)

Latest Videos

 

మొత్తం రూ. 50కోట్ల వరకు ఈ ఆఫర్లు అందిస్తున్నామని సదరు కంపెనీ ప్రకటించడం గమనార్హం. 

అమెజాన్‌లో ధరలు ఇలా..

హానర్‌  ప్లే  (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ధర రూ. 13,999 లు. అసలు ధర 19,999
హానర్‌ 8 ఎక్స్‌ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ధర రూ. 12, 999లు. అసలు ధర 14,999 
హానర్ 8సీ(4జీబీ/32జీబీ) ధర డిస్కౌంట్ అనంతరం రూ.8,999గా ఉంది.
హానర్ వ్యూ20 ధర డిస్కౌంట్ అనంతరం రూ.37,99గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌‌లో హానర్ ఫోన్ల ధరలు ఇలా ఉన్నాయి.. 

హానర్‌ 9 ఎన్‌ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ను రూ. 9,499లకే అందిస్తోంది.  దీని అసలు ధర :   రూ.13999.

హానర్‌ 9 లైట్‌ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ధర రూ. 9,499గా ఉంది.  అసలు ధర రూ. 14,999
హానర్‌ 9 ఐ (4జీబీ/64జీబీ) వేరియంట్‌ ను రూ.10, 999లకే అందిస్తోంది.  అసలు ధర రూ. 17999గా ఉంది. 
ఇలా అన్ని వేరియెంట్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును అదిస్తోంది హానర్ గాలా ఫెస్టివల్ సేల్.

click me!