జియోమీ రెడ్‌మీ నోట్ 7ప్రోకు పోటీగా ఈ నెలలోనే సరికొత్త మొబైల్‌ను ఆవిష్కరిస్తామని రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ 3 ప్రో అనేది రియల్‌మీ 3కి అప్‌గ్రేడ్ వర్షన్. దానికంటే మంచి ప్రాసెసర్, కెమెరాలను కలిగివుంది.
జియోమీ రెడ్‌మీ నోట్ 7ప్రోకు పోటీగా ఈ నెలలోనే సరికొత్త మొబైల్‌ను ఆవిష్కరిస్తామని రియల్‌మీ ప్రకటించింది. రియల్‌మీ 3 ప్రో అనేది రియల్‌మీ 3కి అప్‌గ్రేడ్ వర్షన్. దానికంటే మంచి ప్రాసెసర్, కెమెరాలను కలిగివుంది.
ఢిల్లీ యూనివర్సిటీ స్టేడియంలో ఏప్రిల్ నెలలోనే ఈ సరికొత్త ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ సీఈఓ మాధవ్ సేథ్ సోమవారం ధృవీకరించారు.
కాగా, రియల్‌మీ 3 ప్రోకి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ వెలుగులోకి వచ్చాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్‌ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగివుంది. స్నాప్ డ్రాగన్ 675 ఎస్ఓసీ నుంచి 710ఎస్ఓసీకి అప్ గ్రేడ్ చేయడం జరిగింది. ఇది జియోమీ రెడ్‌మీ నోట్ 7ప్రోకు ధీటుగా ఉండబోతోంది.
4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీని ఈ స్మార్ట్ ఫోన్ కలిగివుంది. అంతేగాక, రియల్‌మీ 3 ప్రో 48 మెగాపిక్సెల్స్ రేర్ కెమెరాను కలిగి ఉండటం విశేషం. సోనీ ఐఎంఎక్స్519 కెమెరా సెన్సార్ కలిగివున్నట్లు సమాచారం. కాగా, రెడ్‌మీ నోట్ 7 ప్రో 48 మెగాపిక్సెల్స్ కెమెరాతో సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సార్ కలిగివుంది. Vooc సపోర్ట్‌తో రియల్‌మీ 3 ప్రో వేగవంతమైన ఛార్జింగ్ కాగలదు.
48ఎంపీ డ్యూయెల్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్, 6.3ఇంచ్ డాట్ నాచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5, టైప్-సీ పోర్ట్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 62జీవీ ర్యామ్ లాంటి ప్రత్యేకతలను కలిగివుంది జియోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో. ఈ ఫోన్ రూ.13,999 ప్రారంభ ధరను కలిగివుంది.
జియోమీకి పోటీగా అదే స్థాయిలో ఫీచర్లతో రియల్‌మీ తాజాగా రియల్‌మీ 3ప్రో స్మార్ట్‌ను విడుదల చేస్తోంది. ఏప్రిల్ మూడో వారంలో ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని తాము ఉత్తమమైన మొబైల్స్ తయారు చేస్తున్నామని రియల్‌మీ సీఈఓ మాధవ్ సేథ్ పేర్కొన్నారు.