ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రియల్‌మీ కొత్త స్మార్ట్ ఫోన్స్..

By Sandra Ashok Kumar  |  First Published Aug 31, 2020, 11:54 AM IST

భారత మార్కెట్లో  రియల్‌మి 7 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేస్తామని  రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌  కూడా ట్విట్‌ చేశారు. రియల్‌మి 7 ప్రో ఇండియాలో సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ చేయనుంది. 


చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల చేయనుంది. రియల్‌మీ 7 ప్రో, రియల్‌మీ 7 సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్నాయని రియల్‌మీ గురువారం మీడియాకు పంపిన ఆహ్వానం ద్వారా తెలిపింది.

భారత మార్కెట్లో  రియల్‌మి 7 సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను విడుదల చేస్తామని  రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌  కూడా ట్విట్‌ చేశారు. రియల్‌మి 7 ప్రో ఇండియాలో సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ చేయనుంది.

Latest Videos

also read 

ఇందుకోసం సోషల్ మీడియా ఛానెళ్లలో డిజిటల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. రియల్‌మి ట్విట్టర్ అక్కౌంట్ లో రియల్‌మి 7, రియల్‌మి 7 ప్రోలో 65W సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్నట్లు పోస్ట్ చేసింది.

ఇది ప్రస్తుత రియల్‌మీ 6 మోడళ్ల కంటే వేగంగా ఉంటుందని సూచిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా రియల్‌మి 7, రియల్‌మి 7 ప్రో లభ్యతపై మైక్రోసైట్‌ను రూపొందించింది.

రియల్‌మి 7 సిరీస్ కేవలం మూడు నిమిషాల ఛార్జ్‌తో 3.5 గంటల వాయిస్ కాలింగ్ లేదా 13.2 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందించగలదని  హైలైట్ చేస్తు తెలిపింది. 65W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, అమో ఎల్‌ఈడీ డిస్‌ప్లే, ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ వంటి ఫీచర్లతో ఫోన్లు విడుదలకాబోతున్నట్లు తెలుస్తున్నది.

 

The countdown has begun!
Brace yourselves as we introduce you to the 2nd Gen 64MP Quad Camera.
3 Days To Go!

Launching & at 12:30 PM, 3rd September on all our official channels.
Know more: https://t.co/GocO44SynR pic.twitter.com/XHL7b2wTS2

— realme (@realmemobiles)
click me!