శాంసంగ్, ఒప్పోకు పోటీగా వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్ వచ్చేస్తోంది..

By Sandra Ashok Kumar  |  First Published Aug 28, 2020, 6:53 PM IST

వన్‌ప్లస్ స్మార్ట్ టీవిలు, ఇయర్ బడ్స్ తరువాత ఇప్పుడు వెరబుల్ గాడ్జెట్స్ సెగ్మెంట్ లోకి ప్రవేశిస్తుంది.  కాని ఈ స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ లేదా డిజైన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. 


స్మార్ట్‌ఫోన్  మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తున్న వన్‌ప్లస్ సంస్థ త్వరలో మొదటి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనుంది. “వన్‌ప్లస్ వాచ్” అని పిలువబడే దీనిని రాబోయే నెలల్లో అందుబాటులోకి తీసుకురానుందని భారీ అంచనాలు నెలకొన్నాయి.

వన్‌ప్లస్ స్మార్ట్ టీవిలు, ఇయర్ బడ్స్ తరువాత ఇప్పుడు వెరబుల్ గాడ్జెట్స్ సెగ్మెంట్ లోకి ప్రవేశిస్తుంది.  కాని ఈ స్మార్ట్‌వాచ్ ఫీచర్స్ లేదా డిజైన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. వన్‌ప్లస్ వాచ్ ఫీచర్లపై ప్రస్తుతానికి సమాచారం లేనప్పటికీ, మార్కెట్లో ఉన్న ప్రముఖ స్మార్ట్‌వాచ్‌లకు  ధీటుగా ఉండేలా మార్కెట్లోకి రానుంది.

Latest Videos

ఓఎల్ఈడీ డిస్ ప్లే, ఫిట్‌నెస్,  హెల్త్ ఫీచర్స్ ముఖ్యంగా హృదయ స్పందన సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ ,  స్లీప్ ప్యాటర్న్ అనాలిసిస్, గోల్స్ ఓరియెంటెడ్ ఎక్స్ ర్  సైజ్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫీచర్లు ఉండవచ్చని భావిస్తున్నారు.

also read 

వన్‌ప్లస్ 2015లో కంపెనీ తన సొంత స్మార్ట్‌వాచ్‌ను అభివృద్ధి చేస్తోందని వెల్లడించింది. 2016లో వన్‌ప్లస్ సీఈఓ పీటర్ లా మాట్లాడుతూ స్మార్ట్‌వాచ్ కోసం డిజైన్‌ను కంపెనీ పూర్తి చేసిందని, రద్దీతో కూడిన చైనా మార్కెట్లో మనుగడ సాగించడానికి హైపర్ ఫోకస్డ్ గా ఉండలని  చెప్పారు.

ఒప్పో ఇటీవల స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసిన తర్వాత చివరకు స్మార్ట్‌వాచ్ విభాగంలోకి ప్రవేశించాలన్న వన్‌ప్లస్ నిర్ణయం ఈ ఊహాగానాలకు దారితీసింది. వన్‌ప్లస్, ఒప్పో, వివో అన్నీ చైనీస్ ఎలక్ట్రానిక్స్ సమ్మేళనం బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్నాయి. వన్‌ప్లస్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో వన్‌ప్లస్ నార్డ్‌ను ప్రారంభించింది. వన్‌ప్లస్ టీవీ మోడళ్ల శ్రేణిని, వన్‌ప్లస్ బడ్స్‌తో సహా పలు రకాల వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను పరిచయం చేస్తూ కంపెనీ గత ఏడాది టెలివిజన్ విభాగాలలోకి ప్రవేశించింది.
 

click me!