ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జి ముఖం మీద ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను అధికారికంగా ప్రకటించింది. పూరికేర్ ఎయిర్ ప్యూరిఫైయర్ సాధారణంగా ఇంటిలో ఉపయోగించే ఎల్‌జి ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఉండే ఫిల్టర్స్ లాగానే ఇందులో కూడా ఫిల్టర్‌లు ఉంటాయి, బ్యాటరీతో పనిచేసే ఈ ప్యూరిఫైయర్ మీకు శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.
కరోనా వైరస్ దేశంలో రోజురోజుకి విస్తృతంగా వ్యాపిస్తుంది. కరోనా సోకకుండా ఫేస్ మాస్కూలు, సానిటైజర్లు, సామాజిక దూరం పాటించక తప్పదు. అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జి ముఖం మీద ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను అధికారికంగా ప్రకటించింది.
పూరికేర్ ఎయిర్ ప్యూరిఫైయర్ సాధారణంగా ఇంటిలో ఉపయోగించే ఎల్‌జి ఎయిర్ ప్యూరిఫైయర్లలో ఉండే ఫిల్టర్స్ లాగానే ఇందులో కూడా ఫిల్టర్‌లు ఉంటాయి, బ్యాటరీతో పనిచేసే ఈ ప్యూరిఫైయర్ మీకు శ్వాస తీసుకోవడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉండే ఫ్యాన్ సెన్సార్లు మీరు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు లేదా బయటికి వదిలినపుడు గుర్తించి దానికి అనుగుణంగా ఫ్యాన్ వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. పూరికేర్ ధరించగలిగే ఎయిర్ ప్యూరిఫైయర్ రెండు H13 HEPA ఫిల్టర్లను ఉపయోగిస్తుంది.
అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. ప్యూరికేర్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడున్న సాధారణ మాస్కుల కన్నా మరింత ఎక్కువగా ఫిల్టర్ ప్రక్రియ చేపడుతుందని ఎల్‌జీ కంపెనీ పేర్కొన్నది. జూలైలో ఎల్‌జి మొట్టమొదట ఈ ఫేస్ మాస్క్ ప్రకటించినప్పుడు సియోల్‌లోని ఒక యూనివర్సిటీ ఆసుపత్రికి 2 వేల పరికరాలను డొనేట్ చేయనున్నట్లు తెలిపింది.
also read
ఎల్‌జి కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కోవిడ్-19 మహమ్మారి నుండి వైద్య సిబ్బందికి ఈ మాస్క్ చాలా సహాయం చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. వైద్య సిబ్బందికి గంటల తరబడి మాస్క్ ధరించడం సులభతరం అవుతుందని వారు భావించారు.
ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల పూరికేర్ ఎయిర్ ప్యూరిఫైయర్ లో 820 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటిలోని బ్యాటరీ రెండు గంటలు హై మోడ్‌లో, ఎనిమిది గంటలు తక్కువ మోడ్‌లో పనిచేస్తాయి.
మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో ఆల్ట్రావయోలెట్ కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గుర్తించి మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్‌జీ పేర్కొన్నది.
చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. పూరికేర్ వియరెబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎల్జీ యొక్క వర్చువల్ ఐఎఫ్ఎ 2020 ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనునన్నారు. దీని ధర ఎంతో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కాని ఈ సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఎంచుకున్న మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.