ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌ మీ 6ప్రో కొత్త వేరియంట్‌.. కాష్ బ్యాక్, జీరో ఈ‌ఎం‌ఐ ఆఫర్ కూడా..

By Sandra Ashok Kumar  |  First Published Aug 5, 2020, 4:38 PM IST

యల్‌ మీ 6 ప్రో లైటనింగ్‌  రెడ్ కలర్ ఆప్షన్ తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త వేరియంట్ రేపు ఆగస్టు 6న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సెల్ ప్రారంభంలో ఉదయం 12 గంటల నుండి (అర్ధరాత్రి) అమ్మకానికి సిద్ధంగా ఉంది. 


లాక్ డౌన్ సడలింపుతో స్మార్ట్ ఫోన్స్ సేల్స్ జోరందుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారిదారులు కొత్త కొత్త వెరీఎంట్స్ మార్కెట్లోకి లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. తాజాగా  రియల్‌ మీ కూడా మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. రియల్‌ మీ 6 ప్రో లైటనింగ్‌  రెడ్ కలర్ ఆప్షన్ తో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ కొత్త వేరియంట్ రేపు ఆగస్టు 6న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సెల్ ప్రారంభంలో ఉదయం 12 గంటల నుండి (అర్ధరాత్రి) అమ్మకానికి సిద్ధంగా ఉంది. కొత్త కలర్ ఆప్షన్స్, మూడు ర్యామ్  వెరీఎంట్స్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. గత మార్చిలో రియల్‌మి 6 ప్రొ లైటనింగ్‌ ఆరెంజ్‌, లైటనింగ్‌ బ్లూ కలర్లలో ఆవిష్కరించారు.

Latest Videos

రియల్‌ మీ 6 ప్రో ధర, సెల్ ఆఫర్లు
రియల్‌ మీ 6 ప్రో లైటనింగ్‌ రెడ్ కలర్ ఆప్షన్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేసింది. రేపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ ప్రారంభంలో కొత్త కలర్ ఆప్షన్ ఉదయం 12 గంటలకు (అర్ధరాత్రి) విక్రయించబడుతుందని యాప్ లిస్టింగ్ సూచిస్తుంది.

ఈ ఫోన్ మూడు కాన్ఫిగరేషన్లలో వస్తుంది - 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 17,999, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 18,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 19.999. రియల్‌ మీ 6 ప్రో లైటనింగ్‌ ఆరెంజ్, లైటనింగ్‌ బ్లూ కలర్ వేరియంట్‌లలో కూడా రానుంది.

రియల్‌ మీ 6 ప్రో సెల్ ఆఫర్‌లలో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్‌తో 10 శాతం, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ అందిస్తుంది, నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ ద్వారా నెలకు రూ.2,111 చెల్లించాల్సి ఉంటుంది.

also read 

రియల్‌ మీ 6 ప్రో ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 రియల్‌ మీ యుఐతో పని చేస్తుంది. 6.6-అంగుళాల పూర్తి హెచ్‌డి + (1080x2400 పిక్సెల్స్) 90Hz రిఫ్రెష్ రేట్‌తో అల్ట్రా స్మూత్ డిస్ ప్లే దీనికి ఉంది. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 720జి ప్రాసెసర్ చీప్ తో వస్తుంది.

8GB వరకు LPDDR4x డ్యూయల్-ఛానల్ ర్యామ్‌తో జతచేశారు. రియల్‌ మీ 6 ప్రోలో 64 జిబి నుండి 128 జిబి యుఎఫ్ఎస్ 2.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు  పెంచుకోవచ్చు.

ఫోటోలు, వీడియోల కోసం రియల్‌ మీ 6 ప్రోలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ జిడబ్ల్యు 1 ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 1.8 లెన్స్‌, ఎఫ్ / 2.3 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, ఎఫ్ / 2.5 ఎపర్చర్‌తో 12 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఫోన్ 30fps ఫ్రేమ్ రేట్ వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్  చేస్తుంది. 

రియల్‌ మీ 6 ప్రో ముందు భాగంలో డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా సెటప్‌ ఉంది, ఇందులో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 ప్రైమరీ సెన్సార్ ఎఫ్ / 2.0 లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ ఎఫ్ / ఫీల్డ్-ఆఫ్-వ్యూ (FoV) తో వచ్చే 2.2 లెన్స్ 105 డిగ్రీలు ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ 4,300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది, 30W  VOOC ఫ్లాష్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. రియల్‌ మీ 6 ప్రోలోని కనెక్టివిటీ ఆప్షన్స్ 4జి వోల్‌టిఇ, వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
 

click me!