తక్కువ ధరకే 128జీబీ స్టోరేజ్ రెడ్‌ మి స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే.. ?

By Sandra Ashok Kumar  |  First Published Aug 4, 2020, 3:27 PM IST

రెడ్‌మి 9 ప్రైమ్ ఇతర ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ దీనిలో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్  లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ రియల్‌ మీ నార్జో 10, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11 వాటికి పోటీగా నిలుస్తుంది.


చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌ మి 9 ప్రైమ్‌ను లాంచ్ చేసింది. జూన్ నెలలో స్పెయిన్ దేశంలో రెడ్ మీ 9 లాంచ్  అయింది. ఈ ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హెలియో జి80 SoCతో  పనిచేస్తుంది. రెడ్‌మి 9 ప్రైమ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ కూడా ఉంటుంది. 

రెడ్‌మి 9 ప్రైమ్ ఇతర ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే బ్యాక్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్ దీనిలో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్  లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ రియల్‌ మీ నార్జో 10, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11 వాటికి పోటీగా నిలుస్తుంది.

Latest Videos


భారతదేశంలో రెడ్‌మి 9 ప్రైమ్ ధర, లభ్యత 
భారతదేశంలో రెడ్‌మి 9 ప్రైమ్ ధర 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.9,999 ఉండగా, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లో ధర రూ. 11.999. రెండు మోడల్స్ స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, మాట్టే బ్లాక్, సన్‌రైజ్ ఫ్లేర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

అంతేకాకుండా, అమెజాన్  ప్రైమ్ డే సందర్భంగా అమెజాన్ సేల్స్ లో ఆగస్టు 6న ఉదయం 10 గంటలకు ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్  ప్రారంభమవుతాయి.  తరువాత ఆగస్టు 17 నుండి ఎం‌ఐ.కాం, అమెజాన్ ఇండియా, ఎం‌ఐ హోమ్ స్టోర్స్, ఎం‌ఐ స్టూడియోస్ ద్వారా అందుబాటులోకి వస్తుంది.

also read 

3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ ఆప్షన్ కోసం రెడ్ మీ 9 ప్రారంభ ధర EUR 149 (సుమారు రూ. 13,200) తో ప్రారంభించింది, అయితే 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ మోడల్ యూరో 179 (సుమారు రూ .15,800) ). కానీ 3 జీబీ ర్యామ్ వేరియంట్‌ను భారత్ లో అందుబాటులో లేదు.

రెడ్‌మి 9 ప్రైమ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 లో MIUI 11 తో పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి + ఐపిఎస్ డిస్‌ప్లే, 4GB DDR4x ర్యామ్, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 SoC వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ ఇమేజ్ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ ఇమేజ్ సెన్సార్ ఉన్నాయి. 118-డిగ్రీల ఫీల్డ్ వ్యూ, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌, కెమెరా సెటప్‌లో 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్‌లో 128GB వరకు ఇంటర్నల్  స్టోరేజ్ అందించింది. మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 512జి‌బి వరకు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 4జి VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.0, GPS / A-GPS, IR బ్లాస్టర్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

ఫోన్ వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. రెడ్‌మి 9 ప్రైమ్ లో 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే, ఫోన్ 10W ఛార్జర్‌తో వస్తుంది, ఫోన్ 198 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.
 

click me!