ప్రీ-ఆర్డర్లకు భలే డిమాండ్.. వన్‌ప్లస్ నార్డ్ సేల్స్ వాయిదా..

By Sandra Ashok KumarFirst Published Aug 4, 2020, 5:16 PM IST
Highlights

వన్‌ప్లస్‌ నార్డ్‌ ప్రీ ఆర్డర్‌కు  అనూహ్యమైన స్పందన వచ్చింది.  షెడ్యూల్‌ చేసిన ప్రకారం వన్‌ప్లస్  నార్డ్‌ ఫోన్లు  విక్రయాలు ఆగస్టు 4 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా ప్రస్తుతం కాస్త ఆలస్యం కానుంది, ఆగస్టు 6కి  నివహించనున్నారు. 

లాక్ డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా ఆన్ లైన సేల్స్ తిరిగి ఊపందుకుంటుంది. సామాజిక దూరం పాటించడానికి ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవడం ఇంటి వద్దకే డెలివరీ పొందటం ప్రజలకు సులువైన మార్గంగా అయింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ ప్రీ ఆర్డర్‌కు  అనూహ్యమైన స్పందన వచ్చింది.  

షెడ్యూల్‌ చేసిన ప్రకారం వన్‌ప్లస్  నార్డ్‌ ఫోన్లు  విక్రయాలు ఆగస్టు 4 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా ప్రస్తుతం కాస్త ఆలస్యం కానుంది, ఆగస్టు 6కి  నివహించనున్నారు. కాని ప్రీ ఆర్డర్ సమయంలో అపూర్వమైన డిమాండ్‌ కరణాన్ని పేర్కొంటూ ఓపెన్ సేల్స్ తేదీలను మార్చినట్లు తెలుస్తోంది.

అధిక డిమాండ్ పెరగడంతో స్టాక్స్  ఊహించిన దానికంటే వేగంగా బుక్ అయ్యాయని కంపెనీ పేర్కొంది. అందువల్ల డిమాండ్ తగ్గట్లు స్టాక్ మరింత పెంచడానికి ఓపెన్ సేల్స్ తేదీని రెండు రోజులు ముందుకు వాయిదా వేశారు.

ఫోరమ్స్ పోస్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్  ఓపెన్ సేల్స్ ఇప్పుడు ఆగస్టు 6న, అంటే గురువారం  అర్ధరాత్రి  12 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముందగా బుక్ చేసుకున్న కొంతమంది కస్టమర్లకు డెలివరీ కొంత ఆలస్యం ఉండవచ్చు అని తెలిపింది. డెలివరీ ఆలస్యం గురించి వివరాలు అడిగినప్పుడు వన్‌ప్లస్ ప్రతినిధులు ఈ ఫోరమ్ పోస్ట్‌ను మాత్రమే సూచిస్తారు.

 

also read 

డెలివరీ ఆలస్యం సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులు ఒక సంవత్సరం అదనపు వారంటీని పొందుతారు. ఈ ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే చెల్లుతుంది. డెలివరీ డిస్ పాచ్ ఆలస్యం అయిన వారికి కూడా వారంటీ పొడిగింపు ఉంటుందని అన్నారు.

అదనపు వారంటీ పొడిగింపును పొందడానికి, వన్‌ప్లస్ వినియోగదారులను వన్‌ప్లస్ కేర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని OTP ఉపయోగించి లాగిన్ అవ్వాలని, ‘మై డివైజెస్’ విభాగం కింద వన్‌ప్లస్ నార్డ్‌ను యాడ్ చేసి, మై డివైజెస్ క్రింద పొడిగించిన వారంటీ ప్లాన్‌ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.


భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ ధర, సేల్స్ , ఆఫర్లు
వన్‌ప్లస్ నార్డ్ ఇప్పుడు అమెజాన్.ఇన్, వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, వన్‌ప్లస్ ఆథరైజ్డ్ స్టోర్స్ ద్వారా ఓపెన్ సేల్‌లో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ డివైజ్ ఆగస్టు 7 నుండి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇతర రిటైల్ భాగస్వాములు ఆగస్టు 12 నుండి సేల్స్ ఉంటాయి.

వన్‌ప్లస్ నార్డ్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ ధర రూ. 27,999,   12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్‌కు రూ.29,999. ఫోన్ గ్రే ఒనిక్స్, బ్లూ మార్బుల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

అమెజాన్.ఇన్ లో మాత్రమే ఆగస్టు 6 నుండి బ్లూ మార్బుల్ కలర్ ఆప్షన్‌ను విక్రయించనుంది. వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్స్ , ఇతర పార్టనర్ స్టోర్స్ ఆగస్టు 8 నుండి సేల్స్  ప్రారంభిస్తాయి. ఇందులో  6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్  కూడా ఉంది, దీని ధర రూ. 24,999, ఈ వేరియంట్ సెప్టెంబర్‌లో అమెజాన్‌లో మాత్రమే ప్రత్యేకంగా లభిస్తుంది.

click me!