రియల్ మీ 5i స్మార్ట్ ఫోన్ కొత్త గ్రీన్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది.ఈ ఫోన్‌ను మొదట వియత్నాంలో లాంచ్ చేయనున్నారు, అయితే ఇది భారత్‌తో సహా ఇతర మార్కెట్లలో ఎప్పుడు లాంచ్ ఆవుతుందో చెప్పలేము.
రియల్ మీ 5i స్మార్ట్ ఫోన్‌ను జనవరి 6న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు రియల్ మీ ధృవీకరించింది. ఈ ఫోన్‌ను మొదట వియత్నాంలో లాంచ్ చేయనున్నారు, అయితే ఇది భారత్‌తో సహా ఇతర మార్కెట్లలో ఎప్పుడు లాంచ్ ఆవుతుందో చెప్పలేము. ఈ స్మార్ట్ ఫోన్ అధికారికంగా ప్రారంభించక ముందే ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్ట్రేషన్ కోసం ఉంచారు.
read also ఎలక్ట్రానిక్ షోలో శాంసంగ్ ఫ్యూచర్ గ్యాడ్జెట్స్...ఏంటో తెలుసా...?
అయితే దీని ధర, ముఖ్య ఫీచర్లను వెల్లడించింది. రియల్ మీ 5i రియల్ మీ 5 స్మార్ట్ ఫోన్ కొద్దిగా టోన్-డౌన్ వెర్షన్ ఇంకా దీని వెనుక ప్యానెల్‌లో కొత్త డిజైన్‌తో రెండు కొత్త కలర్ ఆప్షన్లలో వస్తుంది.రియల్ మీ వియత్నాం ఫేస్‌బుక్ పేజీలో జనవరి 5న దేశంలో రియల్ మీ 5i లాంచ్ అవుతుందని వెల్లడించింది.
అయితే ప్రారంభానికి ముందు, రియల్ మీ 5i వియత్నాం ఇ-కామర్స్ సైట్ ఎఫ్‌పిటి షాప్‌లో ఉంచారు. ఫోన్ ప్రస్తుత రిజిస్ట్రేషన్ ధర VND 4,290,000 (సుమారు రూ. 13,000). ఫోన్ గ్రీన్ ఇంకా బ్లూ కలర్లలో రానుంది. వెనుక ప్యానెల్‌లో గ్రేడియంట్ ఫినిష్ ఉంటుంది.
also read కాల్ చార్జీలు పెంచినా జియోనే బెస్ట్...ఎందుకంటే..!
రియల్ మీ 5i ఫీచర్స్
స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే రియల్ మీ 5iలో 6.52-అంగుళాల HD + (720 x 1600 పిక్సెల్స్) డిస్ ప్లే వాటర్‌డ్రాప్ నాచ్‌తో కలిగి ఉంటుందని లిస్టింగ్ పేజీలో పేర్కొంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉంటాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ ఉంది. రియల్ మీ 5iలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఆండ్రాయిడ్ పై కలర్ ఓఎస్ 6.0.1 తో పనిచేస్తుంది.