ఎలక్ట్రానిక్ షోలో శాంసంగ్ ఫ్యూచర్ గ్యాడ్జెట్స్...ఏంటో తెలుసా...?

By Sandra Ashok Kumar  |  First Published Dec 31, 2019, 1:47 PM IST

శాంసంగ్  కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో అనేక రకాల ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది. 2012 నుంచి శాంసంగ్ c-labs (క్రియేటీవ్ లాబ్) ను ప్రారంభించింది. 


ప్రముఖ స్మార్ట్ ఫొన్ దిగ్గజం 2020 శాంసంగ్ నిర్వహించే ces(కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో)లో అనేక రకాల ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది. 2012 నుంచి శాంసంగ్ c-labs (క్రియేటీవ్ లాబ్) ను ప్రారంభించింది. ఈ సీ ల్యాబ్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో పాటు 40రకాల ప్రాజెక్ట్ లపై వర్క్ చేస్తుంది

 ఇందులో భాగంగా శాంసంగ్ తయారు చేసిన ఐదురకాల ప్రాడక్ట్స్ ను సీఈఎస్ షోలో విడుదల చేయనుంది.

Latest Videos

undefined

also read కాల్ చార్జీలు పెంచినా జియోనే బెస్ట్...ఎందుకంటే..!

వర్టికల్ కీబోర్డ్ - ఈ ఐదు ప్రాజెక్ట్ లలో వర్టికల్ కీబోర్డ్ హైలెట్ గా నిలువనుంది. స్మార్ట్ ఫోన్ సెల్ఫీ కెమెరా ముందు మనకు కావాల్సిన టెక్ట్స్ ను గాల్లో టైప్ చేసుకోవచ్చు. అలా టైప్ చేసిన టెక్ట్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షమవుతుంది.

ఇందుకోసం ప్రత్యేకంగా హార్డ్ వేర్ డివైజ్ లు అవసరం లేదని శాంసంగ్ తెలిపింది. పెద్ద సంఖ్యలో స్మార్ట్ ఫోన్, టాబ్లెట్స్, ల్యాప్ టాప్ లో ఈ వర్టికల్ కీబోర్డ్ ద్వార్ టైప్ చేసుకునే  సదుపాయం ఉంది.

 హైలర్ – ఈ హైలర్ డివైజ్ ద్వారా బుక్ లో ఉన్న కంటెంట్ డైరక్ట్ గా స్మార్ట్ ఫోన్ లో డిస్ ప్లే అవుతుంది. ఇందుకోసం కాంపోనియన్ అనే యాప్ ను వినియోగించాలి. ఆ యాప్ ద్వారా బుక్ లో మనం సెలక్ట్ చేసుకున్న టెక్ట్స్ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యక్షమవుతుంది.

also read స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్...2019లో అమ్మకాలు అదుర్స్

బెకాన్ –  శాంసంగ్ విడుదల చేయనున్న బెకాన్ ప్రాజెక్ట్ ద్వారా జుట్టు ఎందుకు రాలుతుంది..? పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి ఎక్కువై జుట్టు ఊడిపోతుందా అనే అంశాలపై అనాలసిస్ చేసి చెబుతుంది.

సన్నీసైడ్ - కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో “ సన్నీ సైడ్ ” అనే ఆర్టిఫిషియల్ సన్ లైట్  ను శాంసంగ్ విడుదల చేయనుంది. ఈ సన్ లైట్ సూర్యుడి కాంతి పడలేని ప్రదేశాల్లో సైతం వెలుగుల్ని వెదజల్లుతుంది. అంతేకాదు త్వరగా వృద్దాప్యం, వడదెబ్బలు తగలకుండా ఉండేలా మన శరీరానికి విటమిన్ డి ని అందిస్తుంది.

ఆల్ట్రా వి – ఆల్ట్రా వి అతినీలలోహిత కిరణాల్ని గుర్తిస్తుంది. ఎండలో ఉన్నప్పుడు అతినీలలోహిత కిరణాల్ని గుర్తించి, హెచ్చు తగ్గుల్ని పర్యవేక్షిస్తుంది.  

click me!