పుమా బ్రాండ్ కంపెనీ మొదటి రేంజ్ స్మార్ట్‌వాచ్‌ను హాండ్ వాచ్ దిగ్గజ బ్రాండ్ ఫజిల్ కంపెనీతో కలిసి ఈ స్మార్ట్ వాచ్ ని ప్రారంభించింది.పుమా స్మార్ట్‌వాచ్ 44 మి.మీ కేసింగ్ లోపల 1.19-అంగుళాల రౌండ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
దుస్తులు, షూ, వాచ్ లలో టాప్ బ్రాండ్ గా నిలిచిన పుమా ఇప్పుడు కొత్తగా స్మార్ట్ వాచ్ రంగంలోకి అడుగు పెడుతుంది. పుమా బ్రాండ్ కంపెనీ మొదటి రేంజ్ స్మార్ట్‌వాచ్‌ను హాండ్ వాచ్ దిగ్గజ బ్రాండ్ ఫజిల్ కంపెనీతో కలిసి ఈ స్మార్ట్ వాచ్ ని ప్రారంభించింది. పుమా స్మార్ట్‌వాచ్ ధర రూ.19,995 ప్రస్తుతం అన్నీ పుమా స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్, ప్యూమా.కామ్‌లో లభిస్తుంది.
also read ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెన్‌హైజర్ సౌండ్‌బార్ విడుదల
స్మార్ట్ వాచ్ బ్లాక్, వైట్, నియాన్ గ్రీన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.వాచ్ ఒక కటౌట్ నైలాన్, అల్యూమినియం కేస్ లోపల ఒక సిలికాన్ డిజైన్ బెల్ట్ అందిస్తుంది.పుమా స్మార్ట్‌వాచ్ 44 మి.మీ కేసింగ్ లోపల 1.19-అంగుళాల రౌండ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 16 మి.మీ బెల్ట్ కు ఉంటుంది. ఇందులో 512MB ర్యామ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 3100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఈ డివైజ్ గూగుల్ వేర్ ఓఎస్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 4.4 ఇంకా అంతకంటే ఎక్కువ వెర్షన్ (ఆండ్రాయిడ్ గో ఎడిషన్ మినహాయించి) ఇంకా iOS 10 లేదా అంతకంటే ఎక్కువ వర్షన్ సపోర్ట్ ఉంటుంది.ఒక్కసారి ఛార్జీ చేస్తే ఈ డివైజ్ 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అని పుమా కంపెనీ పేర్కొంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇది 50 నిమిషాల్లో డివైజ్ సున్నా నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.
also read ఆపిల్ నుండి మరో కొత్త హోమ్ ప్రాడక్ట్...తక్కువ ధరకే...
ఇంటిగ్రేటెడ్ హార్ట్ బీట్ సెన్సార్, అన్‌టెథెరెడ్ జిపిఎస్, బ్లూటూత్, వై-ఫై, ఆల్టిమీటర్, యాక్సిలెరోమీటర్, యాక్టివిటీ ట్రాకింగ్, గైరోస్కోప్ వంటి ఫీచర్లే కాకుండా ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది 3ఏటిఎం వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది.గూగుల్ ఫిట్ సహాయంతో ఈ వాచ్ పైలేట్స్, రోయింగ్ లేదా స్పిన్నింగ్ వంటి వర్క్ ఔట్స్ ట్రాక్ చేయగలదని ఇంకా పుషప్స్ వంటి ట్రైనింగ్ వర్క్ ఔట్ వ్యాయామాల కౌంట్ చేయగలదని కంపెనీ పేర్కొంది.