రెడ్‌మి నుండి 9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్..అతి తక్కువ ధరకే..

By Sandra Ashok Kumar  |  First Published Jul 2, 2020, 1:42 PM IST

రెడ్‌మి కంపెనీ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. రెడ్‌మి 9ఎ, 9సి రెండు ఫోన్స్ బడ్జెట్ ధరకే  లభిస్తున్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి25 ప్రసెసర్ ద్వారా పనిచేస్తుంది. 
 


చైనా కంపెనీ షియోమీ కంపెనీ జూన్‌ 30న రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9సీ రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. లాంచ్ సంబంధించి షియోమీ కంపెనీ మలేషియన్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ 2మోడళ్లకు  సంబంధించి ఫీచర్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న కొన్ని లీకులు మరింత ఆసక్తిని పెంచాయి.

చివరకి రెడ్‌మి 9ఎ, 9సి రెండు ఫోన్స్ బడ్జెట్ ధరకే  లభిస్తున్నాయి. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి25 ప్రసెసర్ ద్వారా పనిచేస్తుంది.

Latest Videos

undefined

also read ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ లలో టిక్‌టాక్ స్టార్ల హల్ చల్.. ...

రెడ్‌మి 9ఎ, రెడ్‌మి 9సి ధర 

రెడ్‌మి 9 సిరీస్ రెండు స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధరకే అందుబాటులో ఉన్నాయి. 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్‌తో వచ్చే వేరియంట్ ధర ఆర్‌ఎం 359 (సుమారు రూ .6,500) కు లాంచ్ చేశారు. ఇది  మిడ్ నైట్ గ్రే, పీకాక్ గ్రీన్, ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 2 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ మోడల్ రెడ్మి 9సి ధర ఆర్ఎమ్ 429 (సుమారు రూ. 7,500) ఇది కాస్త ఖరీదైనది. ఈ ఫోన్ వచ్చే నెలాఖరులో విక్రయాలు ఉంటాయని  ప్రకటించింది. మిడ్ నైట్ గ్రే, సన్ రైజ్ ఆరెంజ్, ట్విలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండు ఫోన్‌లు 3జీబీ + 32 జీబీ, 4జీబీ + 64జీబీ స్టోరేజ్ రామ్ వేరియంట్లలో కూడా లభిస్తాయని తెలిపింది. అయితే వీటి ధర, లభ్యత వివరాలను ప్రకటించలేదు.

రెడ్‌మి 9ఎ, రెడ్‌మి 9సి  ఫీచర్స్

మొదట్లో మలేషియాలో లాంచ్ చేసిన రెడ్‌మి 9ఎ, రెడ్‌మి 9సి స్మార్ట్‌ఫోన్‌లు ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన రెడ్‌మి 9స్మార్ట్ ఫోన్ లాగా ఉంటుంది. రెండూ స్మార్ట్ ఫోన్స్ 6.53-అంగుళాల హెచ్‌డి+ డిస్ ప్లే  తో వస్తున్నాయి. హుడ్ కింద, 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5,000mAh బ్యాటరీ దీనిలో అమర్చారు. ఇది రెడ్‌మి 9ఏలో  ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి25 ప్రాసెసర్, రెడ్‌మి 9 సిలో మీడియాటెక్ హెలియో జి 35 ప్రాసెసర్ లభిస్తుంది. షియోమి కొత్తగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌ల లభ్యతను ఇంకా వెల్లడించలేదు.

రెడ్‌మి 9ఎకు 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో లభిస్తుంది. సెల్ఫీల కోసం ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రెడ్‌మి 9ఎలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, రెడ్‌మి 9సిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఇందులో ఉంది, దీనికి ఎఫ్/2.2 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఎఫ్/2.4 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఎఫ్/2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 2.4 లెన్స్, సెల్ఫీల కోసం f / 2.2 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా దీనిలో ఉంది. బ్యాటరీ విభాగంలో 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో  5,000 ఎంఏహెచ్ బ్యాటరీని దీనికి అమర్చారు.
 

click me!