పెబుల్ ఇయర్‌పాడ్స్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ రిటైల్ షాపులలో కొత్తగా లాంచ్ చేసిన ఇయర్‌బడ్‌లు అమ్మకానికి ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.
పెబుల్ బ్రాండ్ ఒక సరికొత్త 'స్టీరియో ఇయర్ పాడ్స్' ను ఇండియన్ మార్కెట్లో రూ. 2.990కు లాంచ్ చేసింది. ట్రు వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్‌లు 6 నెలల వారంటీతో కూడా ఇస్తుంది. ఈ ఇయర్‌పాడ్స్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పాటు దేశంలోని అన్ని ప్రముఖ రిటైల్ షాపులలో కొత్తగా లాంచ్ చేసిన ఇయర్‌బడ్‌లు అమ్మకానికి ఉన్నాయని కంపెనీ ప్రకటించింది.
also read పుమా నుండి కొత్త స్మార్ట్ వాచ్...ధర ఎంతో తెలుసా ?
ట్రు వైర్‌లెస్ ఇయర్‌పాడ్స్ ఐపిఎక్స్ 54 ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఇది వాటర్ ఇంకా డస్ట్‌ప్రూఫ్. ఇయర్‌బడ్స్‌లో 10 ఎంఎం డ్రైవర్లు నాయిస్ ఐసోలేషన్ టెక్నాలజీతో పాటు మంచి సౌండ్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది.ఇయర్ పాడ్స్ 180 గంటల పాటు స్టాండ్ బై, 25 గంటల పాటు నాన్-స్టాప్ మ్యూజిక్ ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ అందించగలదని కంపెనీ పేర్కొంది.
ఇది కేసులో ఆటోమేటిక్ స్పీడ్ ఛార్జ్ కాపాబిలిటీతో వస్తుంది.కొత్తగా ప్రారంభించిన పెబుల్ ఇయర్‌బడ్‌లు హ్యాండ్స్-ఫ్రీ స్టీరియో కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకుండా కాల్స్ మాట్లాడడానికి మీకు సహకరిస్తుంది. ఈ 10 మీటర్ల పరిధి వరకు ఇయర్‌బడ్‌లు కనెక్ట్ ఐ ఉంటాయి .
also read ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెన్‌హైజర్ సౌండ్‌బార్ విడుదల
ఇయర్‌పాడ్స్‌లో ప్రతి ఇయర్‌పీస్‌లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. వినియోగదారులు ఒకేసారి రెండు ఇయర్‌బడ్స్‌ను ఉపయోగించవచ్చు లేదా ఒకే మ్యూజిక్ సింగిల్ మోడ్ ద్వారా ఎవరితోనైనా షేర్ చేసుకోవచ్చు.వైర్ లెస్ ఇయర్‌ఫోన్‌ల విషయానికి వస్తే ఒరైమో, బెల్కిన్, పిట్రాన్, ఎక్స్‌మేట్, బ్లూపంక్ట్ వంటి బ్రాండ్లు మంచి తగ్గింపు అఫర్లను అందిస్తున్నాయి. పిట్రాన్ ఇటీవల తన సరికొత్త బేస్‌బడ్స్ లైట్‌ను రూ. 899కు లాంచ్ చేసింది.