వ్యాపారుల కోసం బిజినెస్‌ టీవీలను లాంచ్‌ చేసిన శాంసంగ్‌

By Sandra Ashok KumarFirst Published Jul 24, 2020, 6:14 PM IST
Highlights

కొత్త రేంజ్ శామ్సంగ్ టీవీలు "వినూత్న యాప్స్, డైనమిక్ కంటెంట్, పిక్చర్ క్వాలిటితో నిండిన  అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వారికి అవసరాలను తీర్చాలని మేం కోరుకుంటున్నాం. 

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్‌సంగ్ అల్ట్రా హై డెఫినిషన్ (యుహెచ్‌డి) బిజినెస్ టివిలను భారతదేశంలో ప్రారంభించింది. కొత్త రేంజ్ శామ్సంగ్ టీవీలు "వినూత్న యాప్స్, డైనమిక్ కంటెంట్, పిక్చర్ క్వాలిటితో నిండిన  అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది.

చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వారికి అవసరాలను తీర్చాలని మేం కోరుకుంటున్నాం. పనిప్రదేశంలో వారికి ఎలాంటి   ఇబ్బంది లేకుండా,  సమర్థవంతంగా వినియోగించుకునేలా వీటిని తయారు చేశామని' శాంసంగ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ సేథీ వెల్లడించారు.  

శామ్సంగ్ బిజినెస్ టీవీ సిరీస్ నాలుగు వేర్వేరు స్క్రీన్ సైజులో వస్తుంది: 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల, 70-అంగుళాల. కొత్త టీవీ మోడల్స్ ప్రారంభ ధర రూ .75,000 తో ప్రారంభవుతుంది. 70 అంగుళాల వేరియంట్‌కు రూ.1,75,000 రూపాయలు.

also read రిలయన్స్ జియోమార్ట్ సెన్సెషన్.. రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లు.. ...

ఈ టీవీలు మూడు సంవత్సరాల వారంటీతో వస్తాయి. కొత్త బిజినెస్ టీవీలు రోజుకు 16 గంటలు పనిచేయగలవని, సెట్ చేసిన వ్యాపార సమయాల్లో ఆటోమాటిక్ గా  పనిచేయడానికి ఆన్ / ఆఫ్ టైమర్‌తో వస్తాయని శామ్‌సంగ్ తెలిపింది.

వ్యాపార యజమానులు వారి స్వంత కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి అనుమతించే 100 ఉచిత టెంప్లేట్‌లతో టీవీలు ప్రీలోడ్ చేయబడ్డాయి. కొన్ని టెంప్లేట్‌లలో వర్టికల్ ఓరీఎంటేషన్, టీవీ ప్రోగ్రామ్‌లతో పాటు కంటెంట్‌ను ప్రదర్శించే ప్రమోషన్లు, మోషన్-ఎంబెడెడ్, సీజనల్  సెల్, ఇతర సందర్భాలలో బిజినెస్  పర్ఫెక్ట్ విజువల్స్ అందించే లేఅవుట్లు ఉన్నాయి.

 శామ్సంగ్ బిజినెస్ టీవీ యాప్ ద్వారా టీవీలను రిమోట్ గా కంట్రోల్ చేయవచ్చు. టీవీని సులభంగా డి‌ఐ‌వై ఇన్‌స్టాలేషన్ చేయడంలో సహాయపడుతుంది. బిజినెస్ టీవీ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వినియోగదారుల టీవీలు ఆటోమేటిక్ గా టీవీకి కనెక్ట్ ఆవుతాయి, వెంటనే ఉపయోగం కోసం అందుబాటులో ఉంటాయి. ఈ కంటెంట్ మేనేజ్‌మెంట్ యాప్ కంటెంట్‌ను సులభంగా అప్‌లోడ్ చేస్తుంది.
 

click me!