ఒప్పో నుండి కొత్త 6జి‌బి ర్యామ్ స్మార్ట్ ఫోన్... ధర ఎంతంటే ?

By Sandra Ashok Kumar  |  First Published Dec 31, 2019, 5:36 PM IST

కొత్త ఒప్పో ఎ5 ఇప్పుడు 6జిబి ర్యామ్ వేరియంట్ విడుదల చేసింది. భారతదేశంలో దీని ప్రస్తుత ధర  రూ. 14,990 రూపాయలు.ఈ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఒప్పో A5  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC ఇందులో ఉంది. 


చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇప్పుడు కొత్త ఒప్పో ఎ5 వేరియంట్‌ను ఇండియాలో విడుదల చేసింది. ఒప్పో ఎ5 కొత్త మోడల్ 6 జిబి ర్యామ్‌ తో 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. భారతదేశంలో దీని ధర రూ. 14.990 నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే ఒప్పో A5  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC ఇందులో ఉంది. ఈ ఫోన్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ ప్రొటెక్షన్ తో వస్తుంది.

also read జనవరిలో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్....

Latest Videos


ఒప్పో ఎ5  కొత్త వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసినట్లు ఒప్పో ధృవీకరించింది. ఇందులో 6 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉంది. ఈ ప్రత్యేక వేరియంట్ ధర రూ. 14,990 నిర్ణయించారు. దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన ఆఫ్‌లైన్ రిటైలర్ల నుండి అందుబాటులో ఉంటుంది. 

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఒప్పో ఎ5 ఆండ్రాయిడ్ 9 పై కలర్ ఓఎస్ 6.0.1 స్కిన్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.5-అంగుళాల హెచ్‌డి + (720 x 1600 పిక్సెల్స్) డిస్ ప్లే, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 89%  స్క్రీన్-టు-బాడీ రేషియో, ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+   ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC తో పాటు 6GB RAM వరకు ఉంటుంది.

also read ఎలక్ట్రానిక్ షోలో శాంసంగ్ ఫ్యూచర్ గ్యాడ్జెట్స్...ఏంటో తెలుసా...?


ఒప్పో A5 లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఇంకా  ఇందులో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అమర్చారు. దీనికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ షూటర్ అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. ఇది మైక్రో SD (256GB వరకు) ద్వారా పెంచుకోవచ్చు. ఒప్పో A5 రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని చార్జ్ చేస్తుంది.

click me!