ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో షియోమి ఎం‌ఐ 11 లాంచ్.. ఫీచర్స్ ఇవే..

By S Ashok Kumar  |  First Published Dec 29, 2020, 11:06 AM IST

షియోమి ఎం‌ఐ 11లో  షియోమి అత్యంత అధునాతన డిస్ ప్లే కలిగి ఉంది. ఎం‌ఐ 11 డిస్ ప్లే ఈ4 లైట్ ఇమేజింగ్ మెటీరియల్ నుండి తయారు చేయబడింది. 


షియోమి కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమి ఎం‌ఐ11ను అధికారికంగా లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో వస్తున్న ఎం‌ఐ11 ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్. అలాగే ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మొబైల్ ప్రాసెసర్ అని తెలిపింది.

షియోమి ఎం‌ఐ 11లో  షియోమి అత్యంత అధునాతన డిస్ ప్లే కలిగి ఉంది. ఎం‌ఐ 11 డిస్ ప్లే ఈ4 లైట్ ఇమేజింగ్ మెటీరియల్ నుండి తయారు చేయబడింది. ఫోన్ డిస్ ప్లే రిజల్యూషన్ 2కె. షియోమి ఎం‌ఐ 11 ధర 3,999 చైనీస్ యువాన్ అంటే 45,000 రూపాయలు.

Latest Videos

ఈ ధర వద్ద 128 జీబీ స్టోరేజ్ 8 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది.  8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,299 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ.48,300. ఈ ఫోన్ టాప్ వేరియంట్ 12 జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ ధర 4,699 చైనీస్ యువాన్, అంటే సుమారు 52,800 రూపాయలు. ఫోన్‌ బాక్స్‌లో ఛార్జర్ ఉండదు.


షియోమి ఎం‌ఐ 11 స్పెసిఫికేషన్లు

డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఎంఐయుఐ 12.5, 6.81 అంగుళాల 2కె డబ్ల్యూక్యూహెచ్‌డి డిస్‌ప్లే, 1440x3200 పిక్సెల్‌ రిజల్యూషన్‌,  పంచ్‌హోల్ డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ తో వస్తుంది.  ఇవి కాకుండా ఫోన్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. 

also read 

షియోమి ఎం‌ఐ 11 కెమెరా

కెమెరా గురించి చెప్పాలంటే ఎం‌ఐ 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు, దీనిలో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్స్, దీని పిక్సెల్ సైజ్ 1.6 మైక్రాన్, ఎపర్చరు ఎఫ్/1.85. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది.

ఐఫోన్ 12 కెమెరా కంటే  3.7 రెట్లు పెద్దదని పేర్కొన్నారు. కెమెరాతో మీరు 8కె వీడియోలను రికార్డ్ చేయవచ్చు. రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్, ఇది వైడ్ యాంగిల్ లెన్స్. మూడవ లెన్స్ 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్. ఈ ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

షియోమి ఎం‌ఐ 11 బ్యాటరీ

ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం షియోమి 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఇన్‌ఫ్రారెడ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లను అందించింది. ఈ ఫోన్‌లో హర్మాన్ కార్డాన్ ఆడియో స్టీరియో స్పీకర్ కూడా ఉంది.

ఇది కాకుండా, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంది. ఫోన్‌లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎం‌ఐ టర్బోచార్జ్ 55w వైర్ ఛార్జింగ్, 50w వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి 10W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ బరువు 194 గ్రాములు.

click me!