ఏడాది చివర్లో విపణిలోకి రియల్ మీ ఎక్స్ 2 ప్రో..

By Arun Kumar P  |  First Published Oct 12, 2019, 4:26 PM IST

 చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం రియల్ మీ తన ఎక్స్ 2 ప్రో మోడల్ ఫోన్‌ను ఈ ఏడాది చివరిలోగా భారత విపణిలోకి విడుదల చేయనున్నది. ఈ నెల 15వ తేదీన చైనా, యూరప్ దేశాల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. 


న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల్లో ఒక్కటైన రియల్ ​మీ.. భారత విపణిలోకి మరో కొత్త ఫోన్​ను విడుదల చేయనుంది. డిసెంబర్​లో కొత్త రియల్​మీ ఎక్స్​-2 ప్రోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దానితో పాటు ఎక్స్​టీ 730జీ ఫోన్ కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

ఎక్స్​-2 ప్రో మొబైల్​ను భారత విపణిలోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది రియల్​మీ సంస్థ. ఈ డిసెంబర్​లో విడుదల చేయనున్నట్లు సంస్థ సీఈఓ మాధవ్​ శేఠ్​​ ఇటీవల ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఈనెల 15న చైనాలోనూ, యూరప్ లోనూ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 

Latest Videos

రియల్​మీలో ప్రస్తుతం ఉన్న ఎక్స్​ సిరీస్​కు ఆధునిక హంగులతో ఎక్స్​-2 ప్రోను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. వన్​ప్లస్​ 7టీ సిరీస్​ తరహాలో ఎక్స్​-2 ప్రో ఫోన్‌ తీసుకు రానున్నారు. 

అంటే రియల్ మీ ఎక్స్ 2 ప్రో ఫోన్ లోనూ క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 855+ ఎస్​ఓసీ ప్రాసెసర్​, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్​ మెమొరీ, 90హెచ్​జడ్​ స్క్రీన్, ఎల్​ఈడీ డిస్​ప్లే, ​ఫింగర్​ ప్రింట్​ స్కానర్​ ఉన్నట్లు సంస్థ సీఈఓ మాధవ్​ శేఠ్​​ తెలిపారు. 

ఇంకా 4000 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ, 50 వాట్స్​ సూపర్​ వూక్​ ఛార్జింగ్​ సపోర్ట్​, ఆండ్రాయిడ్​ 9 పై-కలర్​ ఓఎస్​ 6.2 ఎక్స్​-2 ప్రో ప్రత్యేకతలు. రియల్​మీ ఎక్స్​టీ తరహాలో అల్ట్రా వైడ్​ యాంగిల్​ క్వాడ్​ కెమెరా సెటప్​, సూపర్​ మాక్రో లెన్స్​, 32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా, ప్రత్యేక డిజైన్​ వంటి ఫీచర్లు ఉంటాయి. 

ఇక భారత విపణిలో ఇప్పటికే విడుదల చేసిన రియల్​మీ ఎక్స్​టీ ఫోన్లకు అదనపు హంగులతో రియల్​మీ ఎక్స్​టీ 730జీ ఫోన్ కూడా డిసెంబర్​లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఎక్స్​-2 ప్రోలో ఉన్న అన్నిరకాల ఫీచర్స్​ ఇందులో ఉంటాయి. 

రెండింటి మధ్య తేడా స్నాప్​డ్రాగన్​ 730జీ చిప్​ మాత్రమే. ప్రధానంగా వీడియో గేమ్​లు ఎక్కువగా ఇష్టపడేవారిని ఆకర్షించే విధంగా రూపొందించారు.డ్యుయల్ బాండ్ వై-ఫై, జీపీఎస్ విత్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సపోర్ట్, లిక్విడ్ కూలింగ్, ఫ్రేమ్ బూస్ట్ 2.0, టచ్ బూస్ట్ వంటి ఫీచర్లు జత చేశారు. 

click me!