30 నిమిషాల్లో 1600 ఫోన్ల సేల్స్: శామ్‌సంగ్ ఫోల్డబుల్ రికార్డు

By Siva Kodati  |  First Published Oct 6, 2019, 12:10 PM IST

శామ్ సంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రీ బుకింగ్స్ ప్రారంభించిన 30 నిమిషాల్లో 1600 ఫోన్లు అమ్ముడు పోయాయి. దీంతో భారతదేశంలో ప్రీ బుకింగ్స్ మూసివేశారు.
 


దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం శామ్‌సంగ్‌ లగ్జరీ ఫోన్ల విక్రయంలో సరికొత్త రికార్డును లిఖించింది. సంస్థ ఇటీవల విపణిలోకి ఆవిష్కరించిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఫోల్డ్‌ విక్రయాల్లో రికార్డు స్థాయిలో జరిగినట్టుగా సంస్థ వెల్లడించింది. 

ఈ ఫోన్‌ ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూపర్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ హాట్‌ కేకుల్లా బుక్‌ అయిపోయాయని సంస్థ వివరించింది. శుక్రవారం అధికారిక ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్‌ ప్రీమియం ఫోన్‌లను కంపెనీ విక్రయించేసింది. 

Latest Videos

దీంతో సంస్థ ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. మీడియా కథనాల మేరకు ఫోన్‌లను ముందే బుక్‌ చేసుకున్న కొనుగోలుదారుల్లో అత్యధికులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం.ఈ నెల 20న ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకున్న వినియోగదారులకు ఈ ఫోన్లు లభ్యం అవుతాయి. తొలి వైర్‌లెస్ చార్జర్ గల స్మార్ట్‌ఫోన్ ఇది. 
 

click me!