అతి తక్కువ ధరకే రియల్​ మీ కొత్త స్మార్ట్ ఫోన్...అదిరే ఫీచర్లతో...

By Sandra Ashok Kumar  |  First Published Dec 26, 2019, 10:30 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘రియల్ ​మీ’ త్వరలో వినియోగదారులకు 6జీబీ విత్ 64 జీబీ ర్యామ్ స్టోరేజీ వేరియంట్ ఎక్స్2 ప్రో ఫోన్‌ను భారత మార్కెట్​లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న రియల్​మీ ఎక్స్​ 2 ప్రో కన్నా ఇది తక్కువ ధరకే లభించనుంది.


ఎక్స్​2 ప్రో.. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం రియల్ ​మీ నుంచి వచ్చిన కొత్త మోడల్​. అదిరే ఫీచర్లతో ఇటీవలే మార్కెట్​లోకి వచ్చింది. ఈ ఫోన్ ధర రూ.29,999. స్పెసిఫికేషన్స్​ బాగున్నా ఖరీదు కాస్త ఎక్కువని అనుకునేవారికి తాజాగా శుభవార్త చెప్పింది రియల్​మీ.తక్కువ ధరకే ఎక్స్​2 ప్రో 6జీబీ విత్ 64జీబీ స్టోరేజీ వేరియంట్​ ఫోన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

also read లేటెస్ట్ టెక్నాలజితో కొత్త మల్టీ ఫంక్షనల్ ఫ్యాన్...

Latest Videos

క్వాల్కమ్​ స్నాప్​ డ్రాగన్​ 855 ఎస్​ఏసీతోపాటు 8జీబీ ర్యామ్​ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం గల ఈ ఫోన్ 6.5 అంగుళాల ఎఫ్​హెచ్​డీ+ (2400X1080 పిక్సెల్స్) సూపర్​ అమోలెడ్ ​కార్నింగ్ విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ​ఇంకా 90 హెర్జ్​​ డిస్​ప్లే, వాటర్​ డ్రాప్​ నాచ్​ కెమెరా దీని ప్రత్యేకతలు. 64 ఎం​పీ సెన్సార్​తోపాటు 8 ఎం​పీ అల్ట్రా వైడ్​ కెమెరా, 2 ఎం​పీ డెప్త్​ సెన్సార్​, 13 ఎం​పీ టెలి ఫొటో సెన్సార్, ​16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.  

6జీబీ విత్ 64జీబీ వేరియంట్​ ఎక్స్​2 ప్రో ఫోన్‌లో కెమెరా విషయమై సంబంధించి రియల్​మీ ఎలాంటి మార్పులు చేస్తుందో వేచి చూడాలి. రియల్​మీ ఎక్స్​ 2 ప్రో మాస్టర్ ఎడిషన్​ 12 జీబీ+256 జీబీ వేరియంట్ మంగళవారమే మార్కెట్​లోకి వచ్చింది. ఇది పూర్తిగా భిన్నమైన డిజైన్​తో ప్రీమియం లుక్​తో ఆకట్టుకుంటోంది. కాంక్రీట్​, రెడ్ బ్రిక్​ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తోంది. 

also read  చీటింగ్: ఆన్‌లైన్‌ రివ్యూలతో అమెజాన్‌ కస్టమర్లకు బురిడీ...

ఈ ఫోన్ వెనుక భాగం మ్యాట్​ ఫినిష్​​తో ఉంది. మాస్టర్​ ఎడిషన్​ ధర రూ.34,999. ఈ స్మార్ట్​ ఫోన్​ సోమవారం నుంచి ఫ్లిప్​కార్ట్​, రియల్​మీ వెబ్​సైట్​ల్లో అందుబాటులోకి వచ్చింది. జియో చందాదారులకు సుమారు రూ.11,500 వరకు ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది.

click me!