ఒప్పో స్మార్ట్ వాచ్ 41mm, 46mm అనే రెండు వేరియంట్లలో వస్తుంది. వేర్ ఓఎస్ ఆధారంగా కస్టమ్ బిల్డ్ కలర్‌ఓఎస్ తో నడుపుతుంది.
ఒప్పో చివరకు తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒప్పో వాచ్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఒప్పో స్మార్ట్ వాచ్ ఆపిల్ వాచ్ లాగా కనిపిస్తుంది, కానీ దాని స్వంతంగా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఇది రెండు వెరీఎంట్లలో వస్తుంది. ఒకటి 41ఎంఎం ఇంకోటి 46 ఎంఎంవేర్, ఓఎస్ ఆధారంగా కస్టమ్ బిల్డ్ కలర్‌ఓఎస్ తో నడుపుతుంది. ఒప్పో స్మార్ట్ వాచ్ AMOLED డిస్ ప్లేని కలిగి, విఓఓసి ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
also read త్వరలో పెరుగనున్నా మొబైల్ డేటా చార్జీలు...టెలికం శాఖ ఆదేశం?!
ఒప్పో స్మార్ట్ వాచ్ లో ఇసిమ్ సపోర్ట్, 5ఏటిఎం వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. ఒప్పో వాచ్ (41ఎంఎం) వేరియంట్ ధర సిఎన్‌వై 1,499 (సుమారు రూ .15,000). ఫ్లోరోరబ్బర్ పట్టీతో బ్లాక్, గోల్డ్, సిల్వర్ మూడు కలర్లలో వస్తుంది.
ఒప్పో స్మార్ట్ వాచ్ (46ఎంఎం) వేరియంట్ రెండు మెటీరియల్ ఆప్షన్లలో వస్తుంది. అల్యూమినియం మోడల్ బ్లాక్, గోల్డ్ కలర్లలో ఫ్లోరోరబ్బర్ పట్టితో వస్తుంది. దీని ధర సుమారు రూ .20,000.
ఇటాలియన్ లెథర్ పట్టీతో సిల్వర్ కేస్ వెర్షన్‌లో వచ్చే స్టెయిన్‌లెస్ స్టీల్ వేరియంట్ కూడా ఉంది. కొనుగోలుదారులకు సుమారు రూ .25,000 లభిస్తుంది. ఒప్పో స్మార్ట్ వాచ్ చైనాలో మార్చి 24 నుండి దీని అమ్మకాలు ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ మార్కెట్ లాంచ్ పై వివరాలను త్వరలో వెల్లడిస్తారు.
దీని ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఒప్పో స్మార్ట్ వాచ్ ఫ్లెక్సిబుల్ అమోలేడ్ డిస్‌ప్లే ను, రెండు ఫిజికల్ బటన్ల, 41 ఎంఎం వేరియంట్‌లో 320x360 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 46 ఎంఎం మోడల్ స్మార్ట్ వాచ్ 402x476 పిక్సెల్స్ రిజల్యూషన్, 326 పిపి పిక్సెల్ డెన్సిటీతో పెద్ద 1.91-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది.
also read ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్... వాటికికోసం ఫ్రీ రిపేర్ సర్వీస్ ప్రోగ్రామ్...
ఒప్పో స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఒప్పో వాచ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ వేర్ 2500, అపోలో కో-ప్రాసెసర్ ఇందులో ఉంది. 41 ఎంఎం ఒప్పో వాచ్‌లో 300 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చగా, 46 ఎంఎం మోడల్ లో 430 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. రెండింటి లోపల 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఉన్నాయి.
ఒప్పో వాచ్ కేవలం 75 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తుంది. వూక్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. అయితే 15 నిమిషాల ఛార్జింగ్ చేస్తా సుమారు 18 గంటలు పనిచేస్తుంది. ఒప్పో వాచ్‌లో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బారోమెట్రిక్ ప్రెజర్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కెపాసిటెన్స్ సెన్సార్ ఉన్నాయి.