అమెజాన్ సమ్మర్ సేల్: టాప్ స్మార్ట్‌ఫోన్లపై భారీగా తగ్గింపు

By rajashekhar garrepally  |  First Published Apr 26, 2019, 6:42 PM IST

ఇ కామర్స్ దిగ్గజం సమ్మర్ సేల్ పేరుతో వివిధ వస్తువులపై డిస్కౌంట్లను అందించేందుకు సిద్ధమైంది. మే 4 నుంచి మే 7 వరకు నిర్వహించే సేల్‌లో భారీ తగ్గింపులను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర వస్తువులపైనా ఈ డిస్కౌంట్లను అందిస్తోంది.


ఇ కామర్స్ దిగ్గజం సమ్మర్ సేల్ పేరుతో వివిధ వస్తువులపై డిస్కౌంట్లను అందించేందుకు సిద్ధమైంది. మే 4 నుంచి మే 7 వరకు నిర్వహించే సేల్‌లో భారీ తగ్గింపులను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లతోపాటు ఇతర వస్తువులపైనా ఈ డిస్కౌంట్లను అందిస్తోంది.

వన్‌ప్లస్ 6టీ, ఐఫోన్ ఎక్స్ లాంటి ఫోన్లపై కూడా ఆఫర్లను ప్రకటిస్తోంది. టాప్ టు బడ్జెట్ ఫోన్ల వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. 
కాగా, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందే మే 3న సేల్ మొదలవుతుంది. 

Latest Videos

ఈ సేల్‌లో డిస్కౌంట్లతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కార్డ్ యూజర్లకు 10 శాతం అదనంగా తగ్గింపు లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్ఛేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది.

సమ్మర్ సేల్‌లో అమెజాన్ అందిస్తున్న ఆఫర్లివే..

స్మార్ట్ ఫోన్లపై 40శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. వన్‌ప్లస్ 6టీ, సాంసంగ్ గెలాక్సీ ఎం20, గెలాక్సీ ఎం10, రియల్‌మీ యూ1, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ వై2, రెడ్‌మీ 6 ప్రో, హానర్ వ్యూ 20, సాంసంగ్ గెలాక్సీ ఎస్9, వివో నెక్స్‌తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు అందిస్తోంది. 

 నాలుగు రోజుల పాటు జరిగే సేల్‌లో కెమెరాలు, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్‌, హోమ్ అండ్ కిచెన్ అప్లయెన్సెస్‌, ల్యాప్‌టాప్స్, టీవీలు, స్మార్ట్‌వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆఫర్లున్నాయి. అమెజాన్ ఇకో డివైజ్, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇబుక్ రీడర్స్‌పై కూడా తగ్గింపు అందిస్తోంది. 

ఏ వస్తువులపై ఎంత తగ్గింపు అంటే..

గేమింగ్ యాక్సెసరీస్‌పై 60 శాతం వరకు తగ్గింపు
హోమ్ ఆడియోపై 50 శాతం వరకు తగ్గింపు
కెమెరాలపై 50 శాతం వరకు తగ్గింపు

స్పీకర్లపై 50 శాతం వరకు తగ్గింపు
ఫిట్‌నెస్ ట్రాకర్స్‌పై 50 శాతం వరకు తగ్గింపు

ప్రింటర్లపై 45 శాతం వరకు తగ్గింపు
ట్యాబ్లెట్స్‌పై 40 శాతం వరకు తగ్గింపు

హార్డ్‌డ్రైవ్స్‌పై 60 శాతం వరకు తగ్గింపు
మెమొరీ కార్డులు, పెన్‌ డ్రైవ్‌లపై 60 శాతం వరకు తగ్గింపు
స్మార్ట్‌వాచీలపై 60 శాతం వరకు తగ్గింపు అందిస్తోందీ అమెజాన్ సమ్మర్ సేల్.

click me!