21న విపణిలోకి హాన‌ర్ ‘20 ప్రో’: సెల్ఫీ కెమెరా హైలైట్

Published : May 04, 2019, 04:29 PM IST
21న విపణిలోకి హాన‌ర్ ‘20 ప్రో’: సెల్ఫీ కెమెరా హైలైట్

సారాంశం

లండన్ వేదికగా చైనా ఫోన్ల తయారీ సంస్థ హువావె అనుబంధ హానర్ సంస్థ మే 21న హానర్ 20 ప్రో స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్నది.  


లండన్/న్యూఢిల్లీ: హువావే త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ హాన‌ర్ 20 ప్రోను మే 21వ తేదీన లండన్ వేదికగా మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర ఎంత అన్న విషయం ఇంకా వెల్ల‌డించ‌లేదు. 

ఇందులో ముందుభాగంలో డిస్‌ప్లే లోప‌ల ఒక కెమెరాను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. దీన్నే పంచ్‌-హోల్ కెమెరాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే ఈ ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను, ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. 

దీంతోపాటు ఈ ఫోన్‌లో కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌ ప్లస్ 128/256 జీబీ స్టోరేజ్, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. 3650 ఎంఎహచ్ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. శరవేగంగా 22.5 వాట్ల విద్యుత్ చార్జింగ్ సామర్థ్యం దీని స్పెషాలిటీ.  

PREV
click me!

Recommended Stories

Honor Win Turbo: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు పక్కా.. 10,000mAh బ్యాటరీతో హానర్ కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే !
Wireless Charging: వైర్‌లెస్ ఛార్జింగ్ ఎలా ప‌నిచేస్తుంది.? దీనివ‌ల్ల ఫోన్ బ్యాట‌రీపై ప్ర‌భావం ప‌డుతుందా.?