ప్రముఖ మోటరోలా కంపెనీ విపణిలోకి మోటో రేజర్ ఫోల్డబుల్ ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1,24,999గా నిర్ణయించింది. ఇది శామ్‌సంగ్ గెలాక్సీ జడ్‌ప్లిప్ మోడల్ ఫోన్‌తో తల పడనున్నది.
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోటోరోలా మడతపెట్టే ఫోన్‌ను భారత మార్కెట్లో అమ్మకానికి వచ్చింది. మోటో రేజర్‌గా పిలిచే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1.24,999గా కంపెనీ నిర్ణయించింది.
పాతతరం మోడల్ రేజర్ ఫ్లిప్ ఫోన్‌లో మార్పులు చేసి కొత్త హంగులతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా తెచ్చింది. సోమవారం నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ముందస్తు బుకింగ్స్‌ను ప్రారంభించారు.
also read ఆన్ లిమిటెడ్ కాల్స్, హై స్పీడ్ డాటాతో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్...
వచ్చేనెల రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో మోటో రేజర్ ఫోన్ అమ్మకాలు నిర్వహించనున్నారు. ఈ ఫోన్‌ను సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసే వారికి రూ.10,000 క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. శామ్‌సంగ్ మడతపెట్టే ఫోన్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్‌తో ఇదీ పోటీపడనుంది.
ఇందులో 6.2 అంగుళాల ఓఎల్ఈడీ 21:9 డిస్ ప్లే అమర్చారు. ఫోన్ మడతపెట్టినప్పుడు నోటిఫికేషన్స్ చూసుకునేందుకు వీలుగా వెలుపలి భాగంలో 2.7 అంగుళాల 4:3 డిస్ ప్లే గ్లాస్‌తో తయారు చేశారు. ఫోన్ కింది భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ని అమర్చారు.
మోటరోలా మోటో రేజర్ మోడల్ ఫోల్డబుల్ ఫోన్‌లో మొత్తం రెండు కెమెరాలు ఉన్నాయి. వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీ కోసం 5ఎంపీ కెమెరాను అమర్చారు. దీంతో ఫోన్ మడత పెట్టినప్పుడు కూడా సెల్ఫీలు తీసుకోవచ్చు.
also read సెల్ ఫోన్లపై జీఎస్టీ పెంపు:మేకిన్ ఇండియాకు కష్టమేనంటున్న ఇండస్ట్రీ
మోటో రేజర్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో పని చేస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్‌ను వినియోగించారు. 6జీబీ ర్యామ్ విత్ 128జీబీ అంతర్గత మెమొరీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 2,510 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్లూ టూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ కనెక్టివిటీ ఆప్షన్లను మోటో రేజర్ ఫోన్ లభిస్తుంది.
24 నెలల పాటు సిటీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సర్వీస్ యూజర్లకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులోకి తెస్తోంది. రిలయన్స్ జియో యూజర్లకు డబుల్ డేటా బెనిఫిట్ల (రూ.4,999 వార్షిక ప్లాన్)తో రేజర్ ఫోన్ లభిస్తుంది. మోటరోలా మోటో కేర్ పైనా రాయితీనిస్తోంది. మోటో రేజర్ ఫోన్ ‘నాయిర్ బ్లాక్’ రంగులో లభ్యం కానున్నది.