ఎల్‌జి నుండి 8కె వాల్ పేపర్ మోడల్ టీవీలు...

By Sandra Ashok Kumar  |  First Published Mar 14, 2020, 4:18 PM IST

ఎల్‌జి నుండి 55అంగుళాల, 65అంగుళాల సి‌ఎక్స్ అనే రెండు మోడల్స్ ఈ రోజు నుండి దక్షిణ కొరియాలో అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి.ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో 14 కొత్త ఓ‌ఎల్‌ఈ‌డి మోడళ్లలో టీవీ లైనప్‌ 2020 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ బుధవారం ప్రకటించింది.


ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జి లేటెస్ట్ మోడల్స్ టి‌విలను లాంచ్ చేయనుంది.ప్రీమియం టీవీ మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకునేందుకు అప్‌గ్రేడ్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో 14 కొత్త ఓ‌ఎల్‌ఈ‌డి మోడళ్లలో టీవీ లైనప్‌ 2020 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ బుధవారం ప్రకటించింది.

ఎల్‌జి తన సిఎక్స్ సిరీస్ 4కె ఓఎల్‌ఇడి ఎఐ థిన్‌క్యూ టివిలు ఈ నెలలో దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్‌లో లభిస్తాయని, తరువాత ఇతర ప్రాంతాల మార్కెట్లలో లభిస్తాయని చెప్పారు.

Latest Videos

also read ఏడు గంటల బ్యాటరీ లైఫ్ తో సెన్‌హైజర్ కొత్త వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

55 ఇంకా  65-అంగుళాల సిఎక్స్ మోడల్స్ దక్షిణ కొరియాలో బుధవారం సేల్స్ ప్రారంభించగా, 77 అంగుళాల వెర్షన్ వచ్చే నెలలో విడుదల కానుందని ఒక వార్తా సంస్థ తెలిపింది. దక్షిణ కొరియాలో  55 అంగుళాల సిఎక్స్ మోడల్ ఫ్యాక్టరీ ధర కెఆర్డబ్ల్యు 2.8 మిలియన్ కాగా, 65 అంగుళాల వెర్షన్ కెఆర్డబ్ల్యు 5 మిలియన్లు అని కంపెనీ తెలిపింది.

మూడు కొత్త జిఎక్స్ గ్యాలరీ సిరీస్ మోడల్స్ 55, 65, ఇంకా 77-అంగుళాల వెర్షన్లు ఈ నెలాఖరులో విడుదల కానున్నాయి. ఆర్ట్ ఇంస్పాయిర్డ జి‌ఎక్స్ గ్యాలరీ ఓ‌ఎల్‌ఈ‌డి టీవీలు అల్ట్రాథిన్ ఫారమ్ ఫ్యాక్టర్ అని చెబుతున్నారు. 65-అంగుళాల మోడల్ 20 మిల్లీమీటర్లు మందంతో సన్నగా ఉంటుంది. 

హై-ఎండ్ 77-అంగుళాల జిఎక్స్ గ్యాలరీ మోడల్ ఫ్యాక్టరీ ధర కే‌ఆర్‌డబల్యూ 12.5 మిలియన్లకు, 66 అంగుళాలు కే‌ఆర్‌డబల్యూ 5.6 మిలియన్లుకు, 55 అంగుళాలు కే‌ఆర్‌డబల్యూ 3.1 మిలియన్లుకు లభిస్తుంది.

ఎల్‌జి  ఓ‌ఎల్‌ఈ‌డి జెడ్‌ఎక్స్ రియల్ 8కే మోడల్స్  88, 77-అంగుళాల, అల్ట్రాథిన్ 65-అంగుళాల డబల్యూ‌ఎక్స్ ఓ‌ఎల్‌ఈ‌డి వాల్ పేపర్ టీవీ వచ్చే నెలలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

also read టు ఇన్ వన్ : లాప్‌టాప్ కం టాబ్లెట్...ఎప్పుడైనా చూసారా ?

ఈ టీవీల ధరలు ఇంకా ధృవీకరించలేదు, అయితే 88 అంగుళాల జెడ్‌ఎక్స్ మోడల్ కేఆర్‌డబ్ల్యూ 49 మిలియన్లుగా ఉంటుందని కొన్ని వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం ప్రారంభించిన కొత్త టీవీల్లో చాలావరకు థర్డ్ జెనరేషన్ ఏ‌ఐ ప్రాసెసర్‌, మెరుగైన ప్రాసెసింగ్, డీప్ లెర్నింగ్ అల్గారిథమ్‌ ఉంటుందని ఎల్‌జి తెలిపింది.

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం 12 కొత్త ఓ‌ఎల్‌ఈ‌డి టి‌వి మోడళ్లను మెరుగైన గేమింగ్ అనుభవం కోసం ఎన్విడియా  జి- సింక్ సపోర్ట్ ఉంది. మార్కిట్ గణాంకాల ప్రకారం, అమ్మకాలు, ఆదాయం ఆధారంగా 16.3 శాతం మార్కెట్ వాటాతో ఎల్‌జి గత ఏడాది ప్రపంచంలో రెండవ అతిపెద్ద టివి విక్రేతగా నిలిచింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ తరువాత స్థానంలో ఉంది.

click me!