అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఇతర వాటి నుండి నేరుగా టీవీలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇది రిమోట్ కంట్రోల్‌తో వస్తున్నది. ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంటుంది.
షియోమి ఎంఐ టివి స్టిక్ జూలైలో ఐరోపాలో లాంచ్ చేసిన తరువాత ఆగస్టు 5న భారతదేశంలో ఆవిష్కరించింది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌కి పోటీగా దీనిని లాంచ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఇతర వాటి నుండి నేరుగా టీవీలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
ఇది రిమోట్ కంట్రోల్‌తో వస్తున్నది. ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గూగుల్ డేటా సేవర్ ఫీచర్, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ సపోర్ట్ కూడా ఉంది. యాప్‌ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఎంఐ టీవీ స్టిక్ ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ కూడా ఉంది.
టీవి హెచ్‌డిఎంఐ పోర్ట్ ద్వారా దీనిని కనెక్ట్ చేసుకోని స్మార్ట్ టీవీగా మార్చవచ్చు. ఎంఐ టివి స్టిక్ ఆండ్రయిడ్ టీవి 9తో పని చేస్తుంది, గూగుల్ ప్లే స్టోర్‌కు అక్కేస్ చేయగలదు. ఎంఐ బాక్స్ 4కె తరువాత షియోమి నుండి వచ్చిన రెండవ స్ట్రీమింగ్ డివైజ్ ఇది.
షియోమి స్మార్ట్ టివి ప్యాచ్‌వాల్ అనే కస్టమ్ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగిస్తుండగా, ఎంఐ టివి స్టిక్, ఎంఐ బాక్స్ 4కె ఉపయోగించవు.
also read
భారతదేశంలో ఎంఐ టీవీ స్టిక్ ధర, సెల్ తేదీ
ఎంఐ టీవీ స్టిక్ ధర భారతదేశంలో రూ. 2,799. దీని మొదటి అమ్మకాలు ఆగస్టు 7న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) షెడ్యూల్ చేసింది. ఈ డివైజ్ ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోమ్ స్టోర్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. త్వరలో దేశవ్యాప్తంగా ఎంఐ పార్టనర్ స్టోర్స్ ద్వారా కూడా లభిస్తుంది. ఎంఐ టివి స్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ధర విష్యయనికొస్తే అమెజాన్ ఫైర్ టివి స్టిక్ ధర రూ. 3,999 కంటే తక్కువ. షియోమి సొంత ఎంఐ బాక్స్ 4కె ధర రూ.3,499.
ఎంఐ టీవీ స్టిక్ ఫీచర్స్
షియోమి ఎంఐ టీవీ స్టిక్ ఒక కాంపాక్ట్ డివైజ్, క్వాడ్-కోర్ కార్టెక్స్- A53 CPU, ఏఆర్‌ఎం మాలి -450 GPUతో పనిచేస్తుంది. 1జిబి ర్యామ్, 8జిబి స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9తో నడుస్తుంది, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై 802.11 ఎ / బి / జి / ఎన్ / ఎసి, అలాగే బ్లూటూత్ వి 4.2కు సపోర్ట్ ఇస్తుంది. మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ద్వారా టివికి కనెక్ట్ చేసి వాడొచ్చు. హెచ్‌డిఎంఐ ఇన్ పుట్ టీవీకి అనుసంధానిస్తుంది. ఎంఐ టీవీ స్టిక్ 92.4x30.2x15.2 ఎంఎం సైజులో, కేవలం 28.5 గ్రాముల బరువు ఉంటుంది.