భారతదేశంలో లెనోవో హెచ్‌టి 10 ప్రో ధర రూ. 4,499. ఈ ఇయర్‌బడ్స్ గత సంవత్సరం లాంచ్ చేసిన వనిల్లా హెచ్‌టి 10 ఇయర్‌బడ్స్ లాగా ఉంటుంది.
లెనోవో కంపెనీ కొత్త హెచ్‌టి 10 ప్రో టిడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్‌ను భారతదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. లెనోవో ఇయర్‌బడ్స్ తక్కువ ధరతో మంచి సౌండ్ కోసం ఇందులో కొత్త ఇక్యూ టెక్నాలజీ అమర్చినట్లు కంపెనీ తెలిపింది.
లెనోవో హెచ్‌టి 10 ప్రో గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన లెనోవో హెచ్‌టి 10 టిడబ్ల్యుఎస్ యాంప్లిఫైడ్ వేరియంట్. భారతదేశంలో దీని ధరను కూడా వెల్లడించింది. ఇండియాలో లెనోవో హెచ్‌టి 10 ప్రో ధర రూ. 4,499. లెనోవో హెచ్‌టి 10 ప్రో ఇయర్‌బడ్‌లు త్వరలో భారత్‌లో లాంచ్ అవుతాయని కంపెనీ పంపింది.
also read సౌండ్‌కోర్ నుండి "ఐకాన్ మినీ" బ్లూటూత్ స్పీకర్ లాంచ్...
ఇది హెచ్‌టి10 ప్రో ఇయర్‌బడ్స్ పాత హెచ్‌టి10 ఇయర్‌బడ్స్ లాగే ఒకేలా ఉంటాయి అని కంపెనీ తెలిపింది. ప్రో వేరియంట్ కొత్త ఇక్యూ టెక్నాలజీతో వస్తుంది. అయితే హెచ్‌టి 10 ఇయర్‌బడ్స్‌ను గత సెప్టెంబర్‌లో భారతదేశంలో లాంచ్ చేశారు, దీని ధర రూ. 3,999.
క్రొత్త ఈక్యూ టెక్నాలజి చెప్పాలంటే వివిధ మోడ్లను మార్చుతు సంగీతా ప్రియులు మ్యూజిక్ ని విభిన్న ఫ్రీకువెన్సిస్ ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది. ఒకే బటన్‌ను నొక్కడం ద్వారా ఫ్రీకువెన్సిస్ సులభంగా మార్చుకోవచ్చు. కొత్త టెక్నాలజీ ప్యూర్ మ్యూజిక్, ఎక్స్‌ట్రా బేస్ అనే రెండు మోడ్‌లు ఇందులో ఉంటాయి.
ఈ టెక్నాలజి ఇంతకుముందు హై-ఎండ్ ఆడియో డివైజెస్ మాత్రమే లభిస్తుందని లెనోవా పేర్కొంది, అయితే కొత్త ఇక్యూ టెక్నాలజీని లెనోవో కంపెనీ తక్కువ ధరకే ఈ డివైజ్ ద్వారా తీసుకువస్తుంది. హెచ్‌టి10 ప్రో ఇతర ఫీచర్స్ వచ్చేసి ఇందులో డ్యూయల్ మైక్రోఫోన్, వాటర్‌ప్రూఫ్ రెసిస్టంట్, ఎర్గోనామిక్ డిజైన్ తో వస్తుంది.
also read తక్కువ ధరకే షియోమి ఎంఐ బ్లూటూత్ స్పీకర్...
ఇది ఛార్జింగ్ కేసుతో సహ 48 గంటల మ్యూజిక్ ప్లే బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అలాగే 200 గంటల పాటు స్టాండ్‌బై ఉంటుంది. లెనోవో వైర్‌లెస్ హెచ్‌టి10 ప్రో వేరియంట్ ఇయర్‌ఫోన్స్ అదే క్వాల్‌కామ్ 3020 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
బ్లూటూత్ వి5 సపోర్టుతో 20 మీటర్ల వరకు అందిస్తుంది. చివరగా లెనోవో హెచ్‌టి10 ప్రో మెరుగైన ఆడియో క్వాలిటి కోసం ఇది అప్ట్ ఎక్స్ ఆడియోకు సపోర్టు ఇస్తుంది.