ఏప్రిల్‌ 3న ఆపిల్‌ కొత్త ఐఫోన్‌ లాంచ్..?

By Sandra Ashok KumarFirst Published Feb 19, 2020, 4:37 PM IST
Highlights

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్‌ఈ 2ను విడుదల చేయనున్నట్లు సమాచారం కూడా వినిపిస్తుంది. కాగా ఆ ఫోన్‌ను ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్‌ 9 పేరిట దీనిని విడుదల చేస్తుందని తెలిసింది. 

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్ మార్చి 31న  ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్‌ఈ 2ను విడుదల చేయనున్నట్లు సమాచారం కూడా వినిపిస్తుంది. కాగా ఆ ఫోన్‌ను ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్‌ 9 పేరిట దీనిని విడుదల చేస్తుందని తెలిసింది.

ఇక ఆ ఫోన్‌ విడుదలపై మరిన్ని వార్తలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. జర్మన్ సైట్   నివేదిక ప్రకారం ఆపిల్ మార్చి చివరి నాటికి మీడియా ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తోంది.ఈవెంట్ గురించి లేదా ఆపిల్ నుండి ఐఫోన్‌ ఎస్‌ఈ2  లాంచ్ గురించి ఎటువంటి  అధికారిక ధృవీకరణ లేదు.

also read తక్కువ ధరకే షియోమి ఎం‌ఐ బ్లూటూత్ స్పీకర్...

అయితే మార్చి 31న కొత్త మోడల్ ప్రారంభించిన తరువాత, ఐఫోన్ ఎస్‌ఈ2 లేదా ఐఫోన్ 9 ఏప్రిల్ 3 నాటికి మార్కెట్లలోకి వస్తుందని ఒక నివేదిక పేర్కొంది.అదే నిజమైతే, దాని అమ్మకలు యుఎస్ మార్కెట్‌కు లేదా గ్లోబల్ మార్కెట్‌కు వర్తిస్తుందో లేదో చూడాలి.

ఐఫోన్ ఎస్‌ఈ 2 స్మార్ట్ ఫోన్ 4.7-అంగుళాల ఎల్‌సి‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుందని, దీని డిజైన్ ఐఫోన్ 8 ను పోలి ఉంటుందని భావిస్తున్నారు.కొన్ని నివేదికల ప్రకారం ఇది ఏ13 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పవర్ చేస్తుందని, 3జి‌బి ర్యామ్‌ను అందిస్తుందని సూచిస్తున్నాయి. ఇది టచ్ ఐడి హోమ్ బటన్‌ కూడా కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

also read సౌండ్‌కోర్ నుండి "ఐకాన్ మినీ" బ్లూటూత్ స్పీకర్‌ లాంచ్...

ఇది ఇలా ఉంటే రాబోయే కొద్ది నెలల్లో, ఆపిల్ కొత్త ఐప్యాడ్ ప్రోను కూడా విడుదల చేయనుంది. ఇది ట్రిపుల్ లెన్స్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది ఏ‌ఆర్ కోసం 3డి సెన్సింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.కొత్త మాక్‌బుక్ ప్రో లేదా మాక్‌బుక్ ఎయిర్ లేదా రెండూ కూడా త్వరలో ప్రారంభమవుతాయని ఊహిస్తున్నారు.

సరికొత్త సీజర్ స్విచ్ కీబోర్డ్‌తో 13-అంగుళాల మాక్‌బుక్ ప్రోను ఈ సంవత్సరం ప్రారంభించనున్నట్లు ఇంతకు ముందు చేసిన నివేదికలు సూచిస్తున్నాయి.ఆపిల్ అనలిస్ట్ మింగ్-చి కుయో అంచనా వేసిన మరో విషయం ఏంటంటే హై-ఎండ్ హెడ్‌ఫోన్‌లు . ఈ హెడ్‌ఫోన్‌లు బ్లూటూత్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది. దీనికి అదనంగా ఆపిల్ త్వరలో ఎయిర్ పవర్ ఛార్జింగ్ మ్యాట్  కూడా విడుదల చేయనున్నట్లు పుకార్లు వచ్చాయి. 

click me!