ఫ్లిప్‌కార్ట్ నుండి కొత్త స్లిమ్ ల్యాప్‌టాప్‌.... ధర ఎంతో తెలుసా...?

By Sandra Ashok Kumar  |  First Published Jan 10, 2020, 3:04 PM IST

ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు మార్క్యూ లేబుల్ క్రింద ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెడుతుంది. ఎలక్ట్రోనిక్ రంగంలో ఇది ఫ్లిప్‌కార్ట్ కంపెనీ మొదటి ప్రాడక్ట్ అని చెప్పొచ్చు.
 


 కంజ్యూమర్ ఎలక్ట్రోనిక్ షో (CES) 2020లో భారత ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ‘మార్ క్యు  బై ఫ్లిప్‌కార్ట్’ లేబుల్ కింద ల్యాప్‌టాప్‌లను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఈ మొట్టమొదటి ల్యాప్‌టాప్‌ను ఫాల్కన్ ఎయిర్‌బుక్ అని పిలుస్తారు. ఇది చాలా సన్నగా, తేలికగా ఉండేలా రూపొందించారు. ఇంటెల్  8th జెనరేషన్ సిపియులచే పనిచేస్తుంది. ల్యాప్‌టాప్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 39,990, జనవరి 17 నుండి అందుబాటులో ఉంటుంది.

also read కొత్త ఏడాదిలో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

Latest Videos


ఫాల్కన్ ఎయిర్‌బుక్ చాలా స్లిమ్ గా ఇంకా తేలికపాటి బరువుగల ల్యాప్‌టాప్. ఇది 16.5mm మందంతో 1.26 కిలోల బరువు ఉంటుంది. ఇది 13.3-అంగుళాల పూర్తి-హెచ్‌డి ఐపిఎస్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఇంటెల్ 8th జనరేషన్ కోర్-ఐ 5 సిపియుతో వస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ కూడా ఉన్నాయి.

ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవటానికి ల్యాప్‌టాప్‌కు ప్రత్యేకమైన ఎస్‌ఎస్‌డి స్లాట్ ఉందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దీని ద్వారా 1 టిబి వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ట్రాక్‌ప్యాడ్ మల్టీ-టచ్ గెశ్చర్స్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫాల్కన్ ఎయిర్‌బుక్‌లో 37Whr బ్యాటరీ ఉంది, ఇది 5 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. 10,000 కంటే ఎక్కువ పిన్ కోడ్ కవరేజీకి సపోర్ట్ తో డోర్-స్టెప్ వారంటీని అందిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్  ప్లాట్‌ఫామ్‌పై మిలియన్ల మంది కస్టమర్ రివ్యూలను విశ్లేషించి మార్కెట్‌ను అధ్యయనం చేసిన తర్వాత ఫాల్కన్ ఎయిర్‌బుక్‌ను లాంచ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇంటెల్ మరియు మైక్రోసాఫ్ట్ తో కలిసి ఈ ల్యాప్‌టాప్‌ను నిర్ణయించిన ధర వద్ద  పొందగలిగేలా  తయారుచేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్రకారం, స్లిమ్, తేలికపాటి బరువు ల్యాప్‌టాప్ విభాగంలో రాబోయే రెండేళ్లలో 18 శాతం నుండి 65 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.

also read శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఎన్నో తెలుసా...


ఈ ల్యాప్‌టాప్‌ ప్రారంభోత్సవం గురించి ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్ష్ మీనన్ మాట్లాడుతూ "మా ప్రైవేట్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో బడ్జెట్  గురించి ఆందోళన చెందకుండా వినియోగదారులకు పూర్తిస్థాయి ఉత్పత్తులను సృష్టించడం, రూపకల్పన చేయడం లక్ష్యంగా పెట్టుకుంది."ఫాల్కన్ ఎయిర్‌బుక్ లేటెస్ట్  క్లాస్ ఫీచర్లను అందిస్తుంది. మా కస్టమర్ల కోసం స్ట్రాంగ్ వాల్యూస్ అందించనుంది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్  నైపుణ్యం సహాయంతో భారతీయ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించిన ల్యాప్‌టాప్‌ను మెరుగైన పనితీరును అందిస్తుంది.” అని అన్నారు.
 

click me!