కొత్త ఏడాదిలో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

By Sandra Ashok Kumar  |  First Published Jan 10, 2020, 1:13 PM IST

కొత్తేడాదిలో అద్భుతమైన స్మార్ట్​ఫోన్లను విపణిలో ఆవిష్కరించేందుకు అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. జనవరిలోనే చాలా వరకు కొత్త స్మార్ట్​ఫోన్లు భారత విపణిలోకి రానున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను అమెరికా లాస్​వేగాస్​లో జరిగే కన్స్యూమర్​ ఎలక్ట్రానిక్​ షో(సీఈఎస్)-2020లో ప్రదర్శనకు పెట్టనున్నాయి.  


న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు రోజుకో వినూత్న ప్రొడక్ట్‌ను విపణిలో ఆవిష్కరిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులతో ఎప్పటికప్పుడు వినియోగదారులకు చేరువయ్యేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ఏడాది ప్రారంభంలోనే మార్కెట్​లో తమ నూతన ఉత్పత్తులను పరిచయం చేయడానికి సిద్ధమయ్యాయి. 

దక్షిణ కొరియా స్మార్ట్​ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ ఈ జనవరిలో రెండు కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. గెలాక్సీ ఎస్​10, నోట్​ 10 లైనప్​ను మరింత ముందుకు తీసుకెళ్తూ వాటిలో 'లైట్'​ వెర్షన్లను తెచ్చింది. ప్రస్తుతానికి వీటి ధరపై స్పష్టత లేదు.

Latest Videos

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్​10 లైట్ ఫోన్‌లో 6.7 అంగుళాల టచ్​ స్క్రీన్​, 8 జీబీ ర్యామ్ విత్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. ​స్నాప్​ డ్రాగన్ 855, చిప్​సెట్‌తోపాటు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతోపాటు బ్యాకప్ మూడు కెమెరాలు(48ఎంపీ+12ఎంపీ+5ఎంపీ) కలిగి ఉన్నాయి. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తోపాటు 4,700 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. 

also read శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఎన్నో తెలుసా... 

గెలాక్సీ నోట్​ 10 లైట్​ ఫోన్ 6.7 అంగుళాల స్క్రీన్, 8జీబీ ర్యామ్ విత్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 2400x1080 పిక్సెల్ సామర్థ్యంతో హెచ్​డీ+ సూపర్ ఆమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ ఫ్లాట్ డిస్ ప్లే ఉంటుంది. ఎక్సినోస్​ 8895, చిప్​సెట్, ​32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతోపాటు వెనక వైపు 3 కెమెరాలు (12ఎంపీ+12ఎంపీ+12ఎంపీ) అందుబాటులోకి తెచ్చారు. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తోపాటు 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. 

శామ్‌సంగ్ తన గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 ఫోన్లను గత నెలలో వియత్నాంలో విడుదల చేసింది. ఈ మధ్య శ్రేణి స్మార్ట్​ఫోన్లను ఈ నెలలోనే భారత్​లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ51 ఫోన్‌లో 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.5 అంగుళాల టచ్​ స్క్రీన్, ​ఎక్సినోస్​ 9611,  చిప్​సెట్ అమర్చారు. ​32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా బ్యాకప్ 4 కెమెరాలు  (48ఎంపీ + 12ఎంపీ + 5ఎంపీ + 5ఎంపీ) వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీతోపాటు 4,000 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ఇందులో ఉంది. 

శామ్‌సంగ్ గెలాక్సీ ఏ71 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. 6.5 అంగుళాల డిస్ ప్లే, స్నాప్​డ్రాగన్ 730, చిప్​సెట్ ఫీచర్లు జత కలిశాయి. 32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాలు (62ఎంపీ+12ఎంపీ+5ఎంపీ+5ఎంపీ) అందుబాటులోకి తెచ్చారు. ఇంకా 25 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ వసతితోపాటు 4,500 ఎంఏహెచ్​ సామర్థ్యం బ్యాటరీ తీసుకొచ్చారు. 

ఒక వన్ ప్లస్ సీఈఎస్​లో పాల్గొనడానికి ముందు నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు కాన్సెప్ట్​ వన్​ను పరిచయం చేస్తూ డిసెంబర్​లోనే ప్రకటించింది. కాన్సెప్ట్​ వన్​ను స్మార్ట్​ఫోన్ల భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయంగా అభివర్ణించింది. ఇటీవలే కెమెరా టీజర్​ను విడుదల చేసింది. ఇందులో ఇన్​విజిబుల్​ కెమెరా, రంగులు మార్చే గ్లాస్ సాంకేతికతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ ఫీచర్లపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ ఏడాది విడుదల కానున్న స్మార్ట్​ఫోన్లలో అత్యధికులదృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం షియోమీకి చెందిన మీ నోట్​ 10. స్పెయిన్​లో మీ సీసీ9 పేరుతో ఆవిష్కరించిన ఈ స్మార్ట్​ఫోన్​నే నోట్​ 10గా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 108 మెగా పిక్సెల్​ కెమెరా సహా వెనకవైపు మొత్తం 5 కెమెరాలతో రంగప్రవేశం చేయనుంది​. తాజా సమాచారం ప్రకారం మీ నోట్​ 10 ఫోన్ ఈనెల 24న మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

షియోమీకి చెందిన మీ నోట్ 10 ఫోన్ 6.47 అంగుళాల డిస్ ప్లే, స్నాప్​డ్రాగన్ 730జీ చిప్​సెట్‌తోపాటు 8జీబీ ర్యామ్ విత్ 256జీబీ ఇంటర్నల్ మెమొరీ సామర్థ్యం ఉంది. బ్యాకప్ 5 కెమెరాలు (108ఎంపీ, 20ఎంపీ, 5ఎంపీ, 12ఎంపీ, 2ఎంపీ)తోపాటు 32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఫోన్ లో 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో 5,260 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ  ఉంది. 

also read రెడ్​మీకి పోటీగా రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్....

జనవరి 16న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఒప్పొ ఎఫ్15 స్మార్ట్​ఫోన్​లో వాటర్​డ్రాప్ డిస్​ప్లేతో పాటు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. 6.4 అంగుళాల డిస్ ప్లే, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్​, మీడియాటెక్ హీలియో, పీ70 చిప్​సెట్, ​4 బ్యాకప్ కెమెరాలు (64ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ, 2 ఎంపీ), రెండు సెల్ఫీ కెమెరాలు (32ఎంపీ, 8ఎంపీ) అందుబాటులో ఉంటాయి. ఇంకా 20 వాట్ వూక్​ 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ సాంకేతికతతో 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ లభిస్తుంది. 

ఈ నెలలో ఆవిష్కరించనున్న ఫోన్ల జాబితాలో ఉన్న మరో ఆసక్తికరమైన స్మార్ట్​ఫోన్లు హానర్ 9ఎక్స్​, 9ఎక్స్​ ప్రో. ఈ ఫోన్లు రెండు చైనాలో గతేడాది జూలైలోనే విడుదలయ్యాయి. తాజాగా వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేయాలని సంస్థ నిర్ణయించుకున్నట్లు సమాచారం. హానర్ 9ఎక్స్ ఫోన్‌లో 6.59 అంగుళాల డిస్ ప్లే,  కిరిన్ 810 చిప్​సెట్​ ఫీచర్లు దీని సొంతం. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఉంది. 16 ఎంపీ పాప్​ అప్ సెల్ఫీ కెమెరాతోపాటు బ్యాకప్ కెమెరాలు (48ఎంపీ,2ఎంపీ) రెండు ఉన్నాయి. 

హానర్ 9ఎక్స్ ప్రో ఫోన్ 6.59 అంగుళాల డిస్ ప్లే, కిరిన్ 810 చిప్​సెట్​ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతోపాటు 16 ఎంపీ పాప్​ అప్ సెల్ఫీ కెమెరా, వెనకవైపు మూడు కెమెరాలు (48ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ) ఉన్నాయి. మరికొన్నివీటితో పాటు రెడ్​మీ కే30 5జీ స్మార్ట్​ఫోన్ల ముందస్తు బుకింగ్​లు చైనాలో జనవరి 7నుంచి ప్రారంభం కానున్నాయి. వీవో ఎస్​1 ప్రో, రియల్​మీ సీ3, రియల్​మీ 5ఐ సైతం ఈ నెలలో విడుదల కానున్నాయి.
 

click me!