శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ఎన్నో తెలుసా...

By Sandra Ashok Kumar  |  First Published Jan 9, 2020, 4:35 PM IST

2019లో శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ 50 మిలియన్ యూనిట్లను విక్రయించినట్లు శాంసంగ్‌ మొబైల్ హెడ్ డిజె కో వెల్లడించారు.కొరియా దేశంలోని ఓ వార్తా సంస్థ తెలిపిన వావరల ప్రకారం మేము 400,000 నుండి 500,000 గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాము.


సౌత్ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్  లాంచ్ చేసింది. అయితే దీని ధరని $ 2000 ఉన్నప్పటికీ కూడా 2019లో శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ దాదాపు 500,000 యూనిట్లను విక్రయించినట్లు శాంసంగ్‌ తెలిపింది. లాస్ వెగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2020 (సిఇఎస్) శాంసంగ్‌ మొబైల్ చీఫ్ డిజె కో దాదాపు 400,000 నుండి 500,000 యూనిట్లు గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్లను గత సంవత్సరం విక్రయించాము అని తెలిపింది.

also read రెడ్​మీకి పోటీగా రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్....

Latest Videos


కొరియా దేశంలోని ఓ వార్తా సంస్థ తెలిపిన వావరల ప్రకారం మేము 400,000 నుండి 500,000 గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాము. ఈ విక్రయాలు తక్కువ ఉన్నప్పటికీ, గెలాక్సీ ఫోల్డ్ వంటి ఫోల్డబుల్ ఫోన్‌కు దాని అధిక ధర ఇంకా మార్కెట్ సామర్థ్యాన్ని బట్టి డిమాండ్ ఉందని మాకు స్పష్టమవుతోంది.


కానీ శాంసంగ్‌ మొదట్లో ఆశించిన 1 మిలియన్ విక్రయాలకు కొంచెం దూరంగా ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర 1,64,999 రూపాయలకు రిటైల్ ద్వారా అందుబాటులో ఉంది. ఇది బిజినెస్ పరంగా లభించే మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. గెలాక్సీ ఫోల్డ్  4.6-అంగుళాల స్క్రీన్‌తో స్టాండర్డ్ ఫోన్‌లా కనిపిస్తుంది, కానీ ఇది 7.3-అంగుళాల స్క్రీన్‌తో టాబ్లెట్‌కు లాగా ఉంటుంది.

also read జియో కస్టమర్లకు మరో గుడ్ న్యూస్... ఇక దేశమంతా జియో ఫ్రీ..కాల్స్....


మార్కెట్ సామర్థ్యాన్ని మరియు డిస్ ప్లే టెక్నాలజీలో పెట్టుబడిని చూస్తే, శాంసంగ్‌ ఏదో ఒక సమయంలో ఫోల్డబుల్ ఫోన్‌ను అందరికీ అందుబాటులో ఉండే ధర వద్ద తీసుకురావాలని కోరుకుంటుంది. 

అయితే శాంసంగ్‌ కంపెనీ క్లామ్‌షెల్ స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ పై పనిచేస్తుందని, ఇది మడతపెట్టినప్పుడు దాదాపు ఒక స్క్వేర్ షేప్ అవుతుంది. ఈ ఫోన్ ఫోటోలు ఇప్పటికే  లీక్ అయ్యాయి. ఇది ఫిబ్రవరి 11న గెలాక్సీ ఎస్ 11 స్మార్ట్ ఫోన్ తో పాటు దానిని ప్రకటించబడుతోంది. మడతపెట్టే ఫోన్ పాత జెనరేషన్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌ను కలిగి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే ప్లాస్టిక్ స్క్రీన్‌కు బదులుగా గ్లాస్ ప్యానెల్ దీనికి ఉంటుంది.

click me!