శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఫీచర్స్ లీక్....

By Sandra Ashok Kumar  |  First Published Jun 29, 2020, 6:01 PM IST

అయితే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి అనేక రూమర్లు, ఆసక్తికరమైన అంశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 108 మెగాపిక్సెల్ కెమెరాను పొందడం ఇది మొదటిసారి కాదు. 


ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ , సౌత్ కొరియన్ కంపెనీ  శాంసంగ్ గెలాక్సీ 20 అల్ట్రా ఆగస్టు 5న ఆవిష్కరించనుందని  సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించి అనేక రూమర్లు, ఆసక్తికరమైన అంశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 108 మెగాపిక్సెల్ కెమెరాను పొందడం ఇది మొదటిసారి కాదు. ఈ ఫోన్‌ను ఆగస్టులో లాంచ్ కానుంది. శామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా గురించి చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ లాంచ్ ముందే కొన్ని వివరాలు మళ్లీ లీక్ అయ్యాయి.

Latest Videos

రోలాండ్ క్వాండ్ట్ 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉందని ఒక కొత్త సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ కొత్త లీక్ మరింత విశ్వసనీయంగా కనిపిస్తుంది ఎందుకంటే గెలాక్సీ ఎస్ 20 అల్ట్రాలో కనిపించినట్లుగా అదే సైజ్ లో ఉన్న లెన్స్‌ను దీనికి ఉందని పేర్కొన్నాడు.

గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఆగస్టు మొదటి వారంలో లాంచ్ కానున్నట్లు భావిస్తున్నారు. అలాగే ఎస్-పెన్ స్థానాన్ని మార్చనుందని భావిస్తున్నారు. అయితే, ప్లస్ మోడల్ ను కూడా లాంచ్ చేయనుందా, లేదంటే రెగ్యులర్ నోట్ 20, అల్ట్రా  తీసుకొస్తుందా అనే దానిపై స్పష్టత లేదు.

also read 

తాజాగా 108 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో, 5జీ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుందని తాజా లీక్ ద్వారా తెలుస్తోంది. గెలాక్సీ ఎస్ 20 అల్ట్రాలో108 మెగాపిక్సెల్ కెమెరా ఖాయం అంటూ ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ ట్వీట్ చేశారు.

108 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు  6.9 అంగుళాల భారీ స్క్రీన్ తో  గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ను తీసుకు రానుందని అంచనా. ఫోన్ విషయానికొస్తే,గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 165 మి.మీ పొడవు, 77.2 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం కలిగి ఉంటుందని ఫోన్ గురించి కొత్త లీక్ వెల్లడించింది.

ఫీచర్స్  విషయానికొస్తే, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 6.9-అంగుళాల పెద్ద స్క్రీన్ ఉంటుందని ఆన్‌లీక్స్ గతంలో పేర్కొంది. ఇది 6.8-అంగుళాల డిస్ ప్లే  వచ్చిన గెలాక్సీ నోట్ 10ప్లస్ లో కనిపించే దాని కంటే పెద్దదిగా ఉంటుంది. గెలాక్సీ నోట్ 20 అల్ట్రా వేగమైన రిఫ్రెష్ రేట్ల కోసం 120 హెర్ట్జ్ మోడ్‌తో రావచ్చని గతంలో వచ్చిన నివేదికలు సూచించాయి. దీనికి అదనంగా, ఎల్‌టిపిఓ టెక్ ఉపయోగించి ఫోన్‌ ప్యానెల్ నిర్మించనున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

click me!