అమెజాన్ నుండి కొత్త ఎకో డివైజ్... కారులో ప్రయాణించేటప్పుడు....

By Sandra Ashok Kumar  |  First Published Jan 8, 2020, 11:55 AM IST

ఈ డివైజ్ కారులో ఉపయోగించుకోవడాని కోసం ప్రత్యేకంగా రూపొందించారు.  కారులోని అమెజాన్  అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు ఆకెస్స్ చేస్తుంది.


మ్యూజిక్ స్ట్రీమింగ్, స్మార్ట్ స్పీకర్లు వేగంగా ప్రజాదరణ పొందడంతో, అమెజాన్ తన ఎకో సిరీస్ స్మార్ట్ స్పీకర్లు ఇంకా  డివైజ్  లను భారతదేశంలో ఎక్కువ  అమ్మకాలు చేసింది. కంపెనీ ఇప్పుడు సరికొత్త ఎకో ప్రాడక్ట్ అయిన అమెజాన్ ఎకో ఆటోను రూ. 4,999 లాంచ్ చేసింది.

ఈ డివైజ్ కారులో ఉపయోగించుకోవడాని కోసం ప్రత్యేకంగా రూపొందించారు.  కారులోని అమెజాన్  అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు ఆకెస్స్ చేస్తుంది. వినియోగదారులు ఏదైనా అలెక్సా-లింక్డ్ స్ట్రీమింగ్ సర్విస్ నుండి మ్యూజిక్ ప్లే చేయవచ్చు, అలాగే అలెక్సా నుండి వివిధ అంశాలపై సమాచారాన్ని కూడా వినవచ్చు.

Latest Videos

also read పాకెట్‌లో సరిపోయే వైర్ లెస్ బ్లూటూత్ స్పీకర్...ధర కూడా తక్కువే...


అమెజాన్ ఎకో ఆటో ఇప్పుడు ప్రీ-ఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉంచారు. జనవరి 15 నుండి దీనిని విడుదల చేసి డెలివరీ చేయనుంది. ఈ డివైజ్ సాధారణంగా చాలా కార్లలో కనిపించే 12 వి ఎలక్ట్రికల్ సాకెట్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం మీ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా పనిచేస్తుంది.


ఈ డివైజ్ ‘అలెక్సా’ వేక్ అప్ అనే పదాన్ని వినడానికి ఎనిమిది మైక్రోఫోన్‌లను ఇందులో కలిగి ఉంది. స్ట్రీమింగ్ మ్యూజిక్, ఆడియోబుక్స్, లాండ్ మార్క్స్, ఇంట్రెస్టింగ్  ప్రదేశాలు, అలెక్సా స్కిల్స్ ఇంకా మరెన్నో ఆప్షన్స్ ఉన్నాయి.

also read samsung CES 2020: శామ్‌సంగ్ నుండి కొత్త గెలాక్సీ క్రోమ్‌బుక్‌ విడుదల


ఈ డివైజ్ కి స్పీకర్ ఉండదు కనుక దానికి బదులుగా మీ కారు స్టీరియో సిస్టమ్‌కు 3.5mm కేబుల్ లేదా ఆడియో కోసం బ్లూటూత్ ఉపయోగించి కనెక్ట్ అవుతుంది. ఎకో ఆటోలో రెండు బటన్లు ఉంటాయి - ఒకటి యాక్షన్ బటన్ మరొకటి మైక్రోఫోన్ మ్యూట్ బటన్ - ముందు భాగంలో ఇండికేషన్ లైట్ ఉంటుంది.


ఈ డివైజ్ మీడియాటెక్ MT7697 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-కంట్రోల్డ్ యాక్సెస్ కోసం దీనిని ఉపయోగించవచ్చు - ఎకో ఆటోను ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు.అమెజాన్ ఇప్పుడు భారతదేశంలో వైడ్ రేంజ్  సిరీస్ ఎకో డివైజ్లను కలిగి ఉంది. వీటిలో ఇటీవల లాంచ్ చేసిన ఎకో ఇన్పుట్ పోర్టబుల్, ఎకో ఫ్లెక్స్, ఎకో స్టూడియో ఉన్నాయి. ఈ డివైజ్లు అన్నీ ఇంటిలో ఉపయోగించుకోవడాని కోసం వాడుతున్నారు.
 

click me!