ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను అందించేందుకు ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌తో మరోసారి మీ ముందుకు వస్తోంది. అమెజాన్ ఇండియాస్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఏప్రిల్ 11 నుంచి 13 వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లను అందించేందుకు ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌తో మరోసారి మీ ముందుకు వస్తోంది. అమెజాన్ ఇండియాస్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఏప్రిల్ 11 నుంచి 13 వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
మీరు ఊహించని ధరల్లో మీకు నచ్చిన ఫోన్లను అందిస్తున్నామంటూ అమెజాన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. వన్ ప్లస్ 6టీని మీ భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చని తెలిపింది.
ప్రస్తుతం OnePlus 6T(6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజి) ధర రూ. 37,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరీజి మొబైల్ ధర రూ. 41,999గా ఉంది. 256జీబీ మోడల్ ధర రూ.45.999. OnePlus 6T McLaren లిమిటెడ్ ఎడిషన్ (10జీబీ ర్యామ్) ధర రూ.50,999గా ఉంది. వీటిపై అమెజాన్ ఏ మేరకు తగ్గిస్తుందో వేచిచూడాలి.
ఇక యాపిల్ ఐఫోన్ ఎక్స్ కూడా డిస్కౌంట్ ధరకే లభిస్తుందని చెప్పిన అమెజాన్.. ఏ మేర తగ్గింపు ఇస్తుందో స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం దీని ధర రూ.74,999గా ఉంది. కాగా, దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఐఫోన్ ఎక్స్ ఆర్‌ని డిస్కౌంట్ ధ్టర్‌కి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందించనుంది.
హానర్ తోపాటు ఇతర స్మార్ట్‌ఫోన్లపైనా భారీ డిస్కౌంట్లను అందించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. సుమారు రూ. 8వేల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లతోపాటు మొబైల్ ఫోన్ కేసెస్, హెడ్ ఫోన్స్, ఛార్జర్లు, పవర్ బ్యాంక్స్, ఇతర మొబైల్ పరికరాలపై కూడా డిస్కౌంట్ అందిస్తోంది.
అంతేగాక, టోటల్ డ్యామెజీ ప్రోటక్షన్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్, ఎక్ఛేంజ్ ఆఫర్స్, క్యాసిఫై ద్వారా మీ పాత ఫోన్లపై 6శాతం అదనపు విలువను అందిస్తోంది.